8, నవంబర్ 2020, ఆదివారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ 🙏



ఆసారే సంసారే నిజభజన దూరే2జడధి యా

భ్రమంతం మా మంధం పరమకృపయా పాతు

ముచితమ్ 

మదన్య: కో దీన స్టవ కృపణ రక్షాతినిపుణః 

త్వదన్య: కో వా మే త్రిజగతి శరణ్య: పశుపతే



ఆత్మానుసంధాన మరయంగ దూరమౌ

              సారహీనమగు సంసార మందు

నాత్మవిజ్ఞానంబు నరయని యంధు0డ 

             సతత పరిభ్రమ సల్పు వాడ

స్వస్వరూపజ్ఞాన సన్మార్గమును జూపి

            దయతోడ రక్షించ తగును నీకు

నిరతంబు దీనుల నిండుమనంబుతో

           నిక్కంబు రక్షించు నిపుణు డీవు

విభవ ! ముల్లోకములయందు వెదకి జూడ

నన్ను రక్షింప గల్గిన సన్నుతాత్ము

డరయ నీ కంటె పరుడెట్టు లధికుడగును ?

పార్వతీనాథ ! పశుపతీ ! పాహి పాహి 13 #



    ✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: