8, నవంబర్ 2020, ఆదివారం

పిల్లలుమనదగ్గరఏంనేర్చుకుంటారు

 పిల్లలుమనదగ్గరఏంనేర్చుకుంటారు..


విమర్శించే_వాతావరణంలో_పెరిగితే..

ఖండించడం నేర్చికుంటారు..!!


ద్వేషంతో_చూసే_వాతావరణంలో_పెరిగితే..

పొట్లాడడం అలవరచు కుంటారు..!!


గుర్తింపు_పొందే_వాతావరణంలో_పెరిగితే..

మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు..!!


స్నేహ_పూరితమైన_వాతావరణంలో_పెరిగితే..

నివసించే ప్రపంచం గొప్పదని భావిస్తారు..!!


నిష్కల్మషంగా_ఉండే_వాతావరణంలో_పెరిగితే..

వారు మానసిక ప్రశాంతతో జీవిస్తారు..!!


స్వచ్ఛమైన_విశ్వాసంగల_స్థితిలో_పెరిగితే..

వివేచనను అలవరచు కుంటారు..!!


అయ్యో_పాపం_అనే_స్థితిలో_పెరిగితే..

తమపై తాము జాలి పడుతుంటారు..!!


భయంతో_పెరిగితే..అభద్రతకు లోనవుతారు..!!


ఎగతాళి_చేస్తే..సిగ్గుతో కుసించి పోతారు..!!


అసూయతో_చూస్తే...

ఈర్ష్య స్వభావాన్ని అలవరచు కుంటారు..!!


నిరుత్సాహ_పరిస్తే..

ఆత్మ విస్వాశాన్ని అలవరచు కుంటారు..!!


ప్రసంసిస్తే... అభినందించడం నేర్చుకుంటారు..!!


భద్రత_ఉండే_స్థితిలో_ఉంటే..

తమపై,తమ చుట్టూ ఉన్న వారిపై విశ్వాసం పెంపొందించు కుంటారు..!!


ప్రేమ_అభిమానాల_మధ్య_పెరిగితే..

పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు..!!

కామెంట్‌లు లేవు: