707. *ఓం గుహ్యరూపిణ్యై నమః.🙏*
చం. జయకరి! *గుహ్య రూపిణి!* లసన్మహనీయ మనోజ్ఞ రూపివై
ప్రియముగ జ్ఞాన నేత్రముల వీక్షణకే కనిపింతు వీవు, నీ
నయ శుభ గుహ్యరూపము ఘనంబుగ భక్తులె చూతురమ్మ, వి
స్మయమును బాపి కన్బడుము సాధకులందరికిన్ మహేశ్వరీ.🙏
అమ్మకు నమస్కరించుచు🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి