*దశకం 18- పృథుచరితము*
*దశకం 18- శ్లోకం 4*
తన్నాశాత్ ఖలజనభీరుకైర్మునీం ద్రై:
తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే ।
త్యకాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్డండే పరిమధితే త్వమావిరాసీః ॥
ఆ వేనుని నాశనము వలన దుష్ట జనులు ఈ భూమియందు విచ్చలవిడిగా ప్రవర్తిచుండగా., మునిపుంగవులు భయపడిరి.
తన తల్లియైన సునీథ చే రక్షింపబడిన వేనుని శరీరములో తొడను మహర్షులు మథింపగా, అతని పాపమంతయు నశించెను. అటుపిమ్మట అతని బాహువును మథింపగా పృథువుగా నువ్వు అవతరించితివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి