అహంకరించ వద్దు. ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. 🌹*
*ఒక రోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని ఇక నేను ఎవరిపైన ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరము లేదు అని చాల గొప్పగా చెప్పుకున్నాడు.*
*ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ బాబు నాతో కాస్త దూరం నడవగలవా అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేసాడు.*
*అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి ఏదైనా చెట్టు కనిపిస్తుందా ఆ నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడాఏ చెట్టు కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ఏంటి బాబు వెతుకుతున్నావు అని అడిగాడు. అయ్యా చాల దూరం వచ్చాము కాసేపు చెట్టు నీడలోకి వెళదాం అని చెప్పాడు.*
*చెట్టు నీడ నీకెందుకు బాబు నీ నీడ లో నువ్వు సేద తీర్చుకో అన్నాడు. నా నీడలో నేను ఎలా అయ్యా అని ఆశ్చర్యంగా అడిగాడు.*
*నువ్వే కదా బాబు నాదగ్గర అన్ని ఉన్నాయి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూసావా ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు అని చెప్పారు.*
*ఇప్పుడు ఆయనకు నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకు వెళ్లకుండానే.*
*మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి ఇతరులపైనా చులకన భావం రాకూడదు.*
(సత్యనారాయణ చొప్పకట్ల)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి