అతి మూత్ర వ్యాధి - Daibetis
అతిమూత్ర వ్యాధి రావడానికి గల కారణాలు -
* అధికమైన ఆలోచనలు , ఆందోళన .
* మద్యం అధికంగా సేవించడం .
* సిఫిలిస్ , గనేరియా వంటి లైంగిక వ్యాదులు.
* శరీరంలో విషరసాయనాల ఉత్పత్తి .
వ్యాధి లక్షణాలు , దశలు -
ఈ వ్యాధి ప్రారంభ దశలో అతిమూత్రం , అతి మూత్ర విసర్జన కలుగుతాయి . శరీరం అంతా నీరసంగా యే పని చేయడానికి ఉత్సాహం లేకుండా పోతుంది . క్రమంగా దేహం అంతా శుష్కించి పోతుంది . వ్యాధి తీవ్రదశకు చేరేకోలది మొఖం అంతా వాడిపోతుంది. నుదురు మీద ముడతలు పడతాయి. వ్యాధి ముదిరే కొద్ది రోజుకి 150 నుంచి 200 ఔన్సుల వరకు మూత్రం పోతూ ఉంటుంది. ఆకుపచ్చ , పసుపుపచ్చ కలిసి మిశ్రపు రంగుతో మూత్రం నుంచి చక్కర బయటకు వెళ్ళడమే ఈ వ్యాదికి నిదర్శనం . మూత్రం పోసినచోట ఎక్కువుగా ఈగలు మూగుతాయి. మూత్రం నేలలో ఇంకిపోయిన తరువాత తెల్లటి మరక కనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి వ్యాధిని ఎవరికీ వారే గుర్తించ వచ్చు. డబ్బు వృధా చేసి మూత్ర పరిక్షలు చేసుకోవలసిన అవసరం లేదు .
వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మూత్రం ద్వారా అల్బుమిన్ అనే శ్వేత ధాతువు ఎక్కువుగా విసర్జించ బడుతుంది. క్రమంగా చర్మం ఎండిపోయి నట్టు మారి సౌందర్యం దెబ్బ తింటుంది. ముఖం కళ తప్పుతుంది. కురుపులు , పుండ్లు, రాచ పుండ్లు పుడుతుంటాయి. నోరు బాగా ఎండిపోతుంది. దీర్గవ్యాది గ్రస్తులకు పంటి చిగుళ్లు ఉబ్బిపోతాయి. పిప్పి పళ్ళు ఏర్పడుతాయి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి బలహీనం అయ్యే కొద్ది కడుపులోని జట రాగ్ని మందగిస్తుంది. అజీర్ణం కలుగుతుంది. అధికంగా వొళ్ళంతా చెమటలు పడుతుంది. పాదాలు వాస్తాయి . గుండె బలహీనం అవుతుంది. కంటికి పొరలు కమ్ముతాయి. ఆడవారిలో శరీరం అంతా దురదలు కలిగి సంభోగ వాంచ పెరుగుతుంది. మగవారిలో సంభోగ వాంచ పూర్తిగా క్షీణిస్తుంది .
తరువాతి పోస్టులో అతిమూత్ర వ్యాధి నివారణ , ఆహార పదార్దాలు వివరిస్తాను .
మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి