రామాయణమ్ 335
...
ఏమి చేయవలెనో నిర్ణయించండి!..
.
మీరంతా ఏకాభిప్రాయముతో ముక్త కంఠముతో కర్తవ్యమును తెలిపిన అది ఉత్తమమైన ఆలోచన అగును .
.
అటులగాక మీలో మీరు అభిప్రాయ భేదములతో ఉండి చివరకు ఒక అభిప్రాయమునకు వచ్చిన అది మధ్యమము ...(దీనిగురించి..మధ్యమము.. modern వివరణ క్రింద చూడండి)
.
ఎవరికి వారు అభిప్రాయ భేదము లతో ఉండి ఐకమత్యములేక ఏకాభిప్రాయమునందు ప్రీతి చూపక చేయు మంత్రాంగము అధమము .
.
అందుచేత ఉత్తమమైన బుద్ధిగల మీరంతా ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు మన కర్తవ్యము తెలుపుడు ,దానినే నేను అంగీకరించి అమలు పరచెదను.
.
ఆ రాముడు సామాన్యుడు కాడు సముద్రమును సుఖముగా దాటగలడు అవసరమయినచో సముద్రమును ఎండించి వేయ గలడు లేక దారి మళ్ళించి వేయగలడు ,సముద్రమును చీల్చి దారి చేసుకొనగలడు .
.
తమ రాజైన రావణుని మాటలు శ్రద్ధగా విన్న మంత్రులు తమతమ అభిప్రాయములను ప్రకటింపచేస్తున్నారు ....అయితే వారెవరికీ రాముని శక్తిసామర్ధ్యముల పట్ల కనీస అవగాహన కూడా లేదు ...వారు ఈ విధముగా పలుక జొచ్చిరి.
.
NB
.
There is a concept called as Six thinking hats
This is a system designed by Edward de Bono ,a Professor of psychology.
.
This tells about a tool for group discussion and individual thinking.
.
He assigns six different colors for six thought streams .
He calls them as hats. Black ,red,green,blue,yellow ,
and white hats ...difference of opinion is natural and inevitable....but how to arrive at the best !!
.
"Six Thinking Hats" this he christened as ...
Parallel Thinking .
.
This process provides a way for groups to plan thinking.
.
This method was trialled within the U. K's civil service.
.
ఈ రకమైన మంత్రాంగము మధ్యమము అని వాల్మీకి మహర్షి చెప్పారు...
.
ఇలాంటి మంత్రాంగము ,ఆలోచనా విధానాల గురించి మన సాహిత్యములో ఎంతో ఉంది.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి