పాఠకులు అంటే బోధకులై ఉండొచ్చు లేదా విద్యార్థులైనా కావొచ్చు. ఎవరైనా గాని వాళ్ళ పఠనంలో ఈ కిందివి ఉన్న యెడల వారిని అధములనే పరిగణించాలి.
మాట్లాడేటప్పుడు రాగాలు తీసేవారు, వేగంగా సంభాషించేవారు, తలను ఊపుతూ మాట్లాడేవారు, రాసిన దానిని చూసి చదివేవారు, కంఠస్థము చేసినదానిని అప్పగించినట్లుగా మాట్లాడేవారు, అర్థం తెలియకుండా మాట్లాడేవారు, పీలకంఠము కలవారు, వీరందరూ పాఠకాధములే సుమా.
అసలు మాట్లాడేటపుడు ముఖములో ఏ విధమైన వికారాలు లేక మాట్లాడాలి. సంక్షిప్తంగా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్త పరచాలి.
ఎటువంటి సందేహాలకు తావులేకుండా తొందరపాటు తొట్రుపాటు లేకుండా కూలంకషంగా పదాలను అర్థవంతంగా కలిపి ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా క్రమబద్ధంతో మధ్యమ స్వరంలో మాట్లాడాలి.
ఇలా చేస్తేనే మన మాటలు ఎదుటి వారిని మంత్ర ముగ్ధులను చేయగలవు.
ఇవి లేనివారందరూ పాఠకాధములే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి