25, సెప్టెంబర్ 2023, సోమవారం

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం, 37వ శ్లోకం*


 *హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్య సే మహీమ్ |* 

 *తస్మా దుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః || 37* 


 *ప్రతిపదార్థం* 


వా = ఒక వేళ; హతః = (నీవు ) చంపబడినచో; స్వర్గమ్ = స్వర్గమును; ప్రాప్స్యసి = పొంద గలవు;వా లేక (అట్లు గాక ); జిత్వా =( నీవు యుద్ధమున ) జయించినచో; మహీమ్ = భూమండల, రాజ్యమును; భోక్ష్య సే = అనుభవించెదవు; తస్మాత్ = అందు వలన; కౌంతేయ = కుంతీకుమారా ! (అర్జునా !); యుద్ధాయ = యుద్ధము చేయట కొరకు; కృత నిశ్చియః = తిరుగు లేని నిశ్చయము గలవాడవై; ఉత్తిష్ఠ = లెమ్ము (కటి బద్ధుడవు కమ్ము )


 *తాత్పర్యము* 


 ఓ అర్జునా! రణరంగమున  మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్య భోగములను అనుభవింప గలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్దమునకు లెమ్ము.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

కామెంట్‌లు లేవు: