27, జూన్ 2024, గురువారం

శాసన సభ్యులు - సుపరిపాలన 11*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 11*


సభ్యులకు నమస్కారములు.


శాసన సభ్యులు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం తమ తమ ఇష్ట దైవాలపై  లేక భగవద్గీతపై ప్రమాణము చేసి బాధ్యతలను స్వీకరించినప్పుడు స్వలాభం కొరకు గాకుండా ప్రజా సేవకు మాత్రమే అంకితంమవ్వాలి.   ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నిర్డేశించిన  గడువులోపల శాసన సభ్యుల తమ తమ ఆస్తులు  మరియు అప్పుల సమాచారం శాసన సభకు సమర్పించ వలసిఉంటుంది. *ఇది ప్రథమ కర్తవ్యము*  ఇటువంటి ప్రకటన  Public document గా పరిగణింప బడుతుంది. సదరు వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా Assembly Secretariat web site లో అధికారులు పొందుపర్చాలి. 


వార్తా కథనాలలో కొంత మంది శాసన సభ్యులు అక్రమాస్తులు, Money Laundering విషయాలలో  పాల్గొన్నట్లు వార్తలు చదువుతూ ఉంటాము.  *సచ్చిలురైన సభ్యులు వీటన్నిటికీ దూరంగా ఉంటారు*.  కొందరి దుశ్చేస్టలు  ప్రజా దృష్టిని మరియు మీడియా  గమనికను ఆకర్షించి వారి ప్రతిష్టను దిగజారుస్థాయి.  న్యాయస్థానాల పరిధిలోనికి వెళ్లనే రాదు. వెళ్ళినా నిజాయితి నిరూపించుకోవాలి.  నిజాయితి నిరూపించుకోలేని పక్షంలో  అనర్హత వేటు పడుతుంది.  *శాసన సభ్యుల చరిత్ర పారదర్శకంగా ఉండాలని ప్రజల ఆకాంక్ష*. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విధి విధానాలను ఉల్లంఘించరాదు. 


ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు వారి వారి నియోజక వర్గాలలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నియోజక అభివృద్ధికి పునాదులు (నూతన కార్యక్రమాలకు), సోపానాలు (అంతకుముందే ఉన్న కార్యక్రమాలకు)  వేయవలసి ఉంటుంది. 


అప్పుడప్పుడు *ప్రజా అసంతృప్తి  సంబంధమైన* వార్తా కథనాలు చూస్తూ ఉంటాము. తమ నియోజక వర్గంలో శాసన సభ్యులు చాలా మటుకు ఉండరని,  ప్రభుత్వ కార్యకలాపాల మిషతో రాష్ట్ర రాజధానిలోనే అధిక శాతం కాలం గడుపుతూ ఉంటారని. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే నియోజక వర్గాలను సందర్శిస్తారని.  ప్రాంతీయ/సంస్థగత ఎన్నికలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర అమాత్యులు శాసన సభ్యులకు ఉద్భోధ చేస్తూ ఉంటారు. శాసన సభ్యులు తమ తమ నియోజక వర్గాలలోనే ఉంటూ సంబంధిత కార్యకలాపాలు చేపట్టాలని.  *ప్రజల చేత మరియు ప్రభుత్వము చేత  అపవాదులు, హెచ్చరికలు రాకుండా శాసన సభ్యులు ఆదర్శంగా ఉండాలి*.  అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన పథకాల విషయమై విదేశీ యానము చేసినా, ఆ పథకాల పాత్రతా, యోగ్యతా, శ్రేష్ఠతా గమనించి, వాటిని తమ తమ నియోజక వర్గాలలో అమలు చేయుటకు మనసా, వాచా కర్మణా పాటుపడాలి. ప్రభుత్వ కార్యాలపై విదేశీ యాత్రలు చేసే శాసన సభ్యులు ప్రజా సంక్షేమ సంబంధమైన అంశాలు...అనగా వ్యవసాయం, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, పట్టణ నిర్మాణము ఇత్యాది వాటి  అభివృద్ధికర పద్ధతులపై దృష్టిపెట్టాలి.  ఆయా నవీన మరియు మెరుగైన పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేసి ప్రజాభ్యున్నతికి  పాటుపడాలి. విదేశీ యాత్రలా లేక విలాస యాత్రలా అని ప్రజలు అపోహపడకుండా ఉండాలి. *ప్రజా ప్రతినిధుల ఇతర రాష్ట్ర మరియు విదేశీ పర్యటనలు కాలక్షేప యాత్రలుగా ప్రజలు భావించరాదు*. మన ప్రతినిధులు మన సంక్షేమం కోసం వారి అధికార కాలాన్ని వినియోగిస్తారని ప్రజలు కూడా విశ్వసించాలి.


*తమ అధికార కాలమంతా తమను ఎన్నుకున్న ప్రాంతాల ప్రజల సేవకై  శాసన సభ్యులు వినియోగించాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు, ఆశపడ్తూ ఉంటారు*.


ధన్యవాదములు.

🙏🙏🙏


*స్వస్తి*

కామెంట్‌లు లేవు: