*మర్కటం - మాటలు*
➖➖➖✍️
```వేసవి కాలంలోని ఒక సాయింత్రం! పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు.```
```స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. ```
```హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసివేసి కిష్కింద చేస్తున్నాయి. ```
```అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. ```
```కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. ```
```స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. ```
```కొద్దిసేపటి తరువాత ఆకోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. ```
```అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. ```
```తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ```
```ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.```
```“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. ```
```స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.```
```*కోతులను ఎప్పుడూ కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.```
```ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.```
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
http://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి