1, జూన్ 2023, గురువారం

అక్షయ పాత్ర*

       *అక్షయ పాత్ర*

                ➖➖➖✍️



*అక్షయ పాత్ర అంటే ఏమిటి....?*


*అక్షయ పాత్ర  వెనకాల ఒక కధ వుంది…*


*పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చాలామంది  బ్రాహ్మణులు కూడా వారి వెంట వెళ్లారు.* 


*కాని అప్పుడు పాండవులకి వీళ్ళందరినీ పోషించే మార్గం తెలియక చాలా ఆలోచనలలో పడ్డారు.* 


*అప్పుడు ధర్మరాజు సూర్యుడిని ప్రార్దించగా వారికి సూర్యభగవానుడు అక్షయపాత్రని ఇస్తారు.*


*”దీని మీద మూత పెట్టి ప్రార్ధిస్తే, ఎంత మందికైనా దీనినుండి కావాల్సిన భోజనం లబిస్తుంది”అని చెప్పారు.* 


*”కాని ఈ అక్షయ పాత్రని కడిగి బోర్లించేస్తే ఇంకా ఆ రోజుకి మళ్ళీ దానినుండి భోజనం లబించదు. కనుక దీనితో మీరు జాగ్రత్తగా అందరిని పోషించండి” అని చెప్పారు.* 


*ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు బ్రహ్మణులందరిని పోషిస్తూ వనవాసం కొనసాగిస్తూ వుంటారు.*


*కాని కౌరవులకి వీరు ఎలా                        ఈ బ్రహ్మణులని పోషిస్తున్నారో అంతుచిక్కక చాల ద్వేషం తో వుంటారు.* 


*ఒకసారి దూర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు.*


*ఒకానొక సందర్భంలో ఆమహర్షి అటుగా వెళ్తూ పాండవుల వద్దకు ఆతిద్యానికి వెళ్లారు.* 


*మహర్షి…  “నేను నదీ స్నానం ఆచరించి వస్తాను. ఈ లోపు మీరు ఆతిద్యానికి అన్నీ సిద్ధం చెయ్యండి” అని ఆయన అక్కడనుండి బయలుదేరి వెళ్ళిపోయారు.*


*పాండవులు ద్రౌపదికి ఆతిద్యానికి అన్నీ సిద్ధం  చెయ్యమని చెప్పగా ద్రౌపది చాల కంగారుగా భయంతో “నేను ఇప్పుడే అక్షయ పాత్రను కడిగివేసేసానే! ఇప్పుడు ఎలా మరి?” అని చింతించింది.* 


*అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని ప్రార్దించారు.* 


*అప్పుడు శ్రీకృష్ణుడు ‘అక్షయపాత్ర ని సరిగా చూడమని కనీసం ఒక్కమెతుకైన దొరుకుతుంది’ అని దాన్ని తెమ్మని అడగ్గా అప్పుడు ద్రౌపది పాత్రలోలో చూడగా ఒక మెతుకు దొరుకుతుంది అది తెత్చి కృష్ణుడికి ఇచ్చింది.*


*అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మెతుకుని వుపయోగించి కృష్ణ మాయతో వారి కడుపు నిండేలా చేసాడు.*


*నదీ స్నానం చేసి వచ్చిన మహర్షి తో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా ఆయన “ఏమిటో కడుపంతా నిండుగా వుంది, ఈ రోజు వద్దు లే మళ్ళీ వస్తాం”  అని అక్కడ నుండి వెళ్ళిపోయారు.*

*ఇది అక్షయపాత్ర కధ.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀.🙏

కామెంట్‌లు లేవు: