*𝕝𝕝 ॐ 𝕝𝕝 _01/06/23 - జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి - శ్రీ శంకరాచార్య కైలాస గమనం_ 𝕝𝕝 卐 𝕝𝕝*
~~~~~~
*శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోడానికి, కైలాస పర్వతానికి వెళ్ళినది ఈరోజే.*
*ఈ రోజే, శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదులవారికి పరమశివుడు "ఐదు చంద్రమౌళీశ్వర" ఆత్మలింగాలు కానుకగా ఇచ్చాడు.*
*ఈరోజే, అమ్మవారు, 100 శ్లోకాల "సౌందర్యలహరీ" గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారికి అనుగ్రహించారు.*
*ఈ ఐదు ఆత్మలింగాలనే, ఆదిశంకరులు, 1) శృంగేరి పీఠంలో, 2) కాంచీ పీఠంలో, 3)కేదార్లో, 4) నేపాల్లోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో, 5) చిదంబరంలలో ప్రతిష్టించారు.*
*శంకరులు, ,"5 లింగాలు" మరియు "సౌందర్యలహరీ" లను భూమిపైకి తెస్తుంటే, "నందికేశ్వరుడు (నందీశ్వరుడు) అడ్డగించాడు. అమ్మవారి మంత్రం శాస్త్రం "శ్రీ సౌందర్యలహరీ" కైలాసం నుంచి భూమిపైకి వెళ్ళిపోతోందని నందీశ్వరుడు అపారమైన తాపముపొంది, పరివేదన చెందాడు. 100 శ్లోకాల సౌందర్యాలహరి నుంచి 59 శ్లోకాలు సౌందర్యలహరిభాగాన్ని శంకరులనుంచి బలవంతంగా తీసుకు పోయాడు.*
*అప్పుడు, శంకర భగవత్పాదులకు అమ్మవారి అశరీరవాణి వినపడింది.*
*శంకరా! నీకీయబడిన 100 శ్లోకాల సౌందర్యలహరి నుంచి 59 శ్లోకాలు నందీశ్వరుడు బలవంతంగా తీసుకున్నాడు కదా! ఆ 59 శ్లోకాలు నువ్వు పూరించు అని అమ్మవారు ఆజ్ఞాపించింది*
*అమ్మవారి కటాక్షంతో శంకరులు 59 శ్లోకాలు పూర్తి చేశారు.*
*41 శ్లోకాల మంత్రభాగాన్ని "ఆనందలహరి" అంటారు.*
*59 శ్లోకాలను సౌందర్యలహరీ అంటారు. ఈ రెండు కలిపి చదివితే కూడా "సౌందర్యలహరీ " అంటారు.*
*32 సంవత్సరాలు మాత్రమే ఈ పాంచ భౌతిక శరీరంతో ఈ భూమిపై సంచరించి, వేద ప్రమాణం నిలబెట్టి, అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకుండా కాపలాగా నలు చెరగులా 4 ఆమ్నాయ పీఠములు పెట్టిన మహాత్ముడు శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు.*
*1) తూర్పున - జగన్నాథ్ లో గోవర్ధన పీఠం*
*2) పడమర - ద్వారకలో కాళికా పీఠం*
*3) ఉత్తరాన - బదరికాశ్రమంలో జ్యోతి పీఠం*
*4) దక్షిణాన - శృంగగిరి (శృంగేరి )లో శారదా పీఠము*
*ఈరోజు,తప్పక సౌందర్యలహరి లోని శ్లోకాలను పారాయణ చేసుకుందాం*
*పరమేశ్వర ప్రసాదిత ఆత్మలింగాలను స్మరించు కుందాం.*
*శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారికి వినమ్రులమై నమస్కరించు కుందాం*
*జయ జయ శంకర - హర హర శంకర*
🪷 🙏🏻 🪷 🪷 🙏🏻 🪷 🪷 🙏🏻 🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి