దానం ధర్మం
दानं प्रियवाक्सहितं ज्ञानगर्वं क्षमान्वितं शौर्यं |
वित्तं त्यागसमेतं दुर्लभमेतच्चतुर्भद्रम् ||
మనకు డబ్బు ఉంటే, మనస్సునకు సంతోషం కల్గించే మాటలతో దానం చేసినపుడే శోభిస్తుంది. గర్వము లేనపుడే, జ్ఞానం శోభిస్తుంది. "క్షమ" ఉంటేనే శౌర్యం శోభిస్తుంది. క్షమను అభ్యసించితే, మనం కోపాన్ని తగ్గించుకొనవచ్చు, లేకపోతే కోపాన్ని తగ్గించుకొనజాలము.
మనం పాపం చేసేటప్పుడు దానిని చూచేవారు ఎవ్వరూ లేరనే భావన మనలో ఉండరాదు. దానిని ఇతరులెవ్వరు చూచినా చూడకపోయినా, చూచే ఈశ్వరుడొక్కడున్నాడు. ఈ న్యాయస్థానాల్ని శాసనాన్ని మనం అపరాధం చేసి గూడా మన తెలివితేటలతో తప్పించుకొనినా, ఆ ఈశ్వరుని మాత్రం మనం తప్పించుకొనజాలము.
"ईश्वरस्सर्व भूतानां हृद्देशेर्जुन तिष्ठति” మనం చేసే ప్రతిపనిని మన హృదయంలో ఉండి ఈశ్వరుడు చూస్తున్నాడు. అతడు 'కర్మఫల ప్రదాత' అనే ధృఢమైన భావనను కలిగి ఉంటే, మన వలన పాపాలు జరగవు. నీవు అంతస్సాక్షికి అవిరుద్ధంగా ప్రవర్తించగలిగితే కృతార్థుడవే, అందుకు మనం ఎక్కడకు వెళ్ళనక్కరలేదు.
మనం ఎన్నో ధర్మాలు చేస్తున్నాం. ఎందుకు? పాపాలు పోవడానికి. అసలు పాపకృత్యాలే చెయ్యడం మనేసే ప్రయత్నంచెయ్యాలి. ఈ విధంగా పాపాలు చెయ్యటం మానివేసి, పుణ్యం మాత్రమే చేయటం నేర్చుకొంటే, మనకు పాప ఫలమైన దుఃఖం కలుగదు. పుణ్యఫలమైన సుఖమే వస్తుంది, అప్పుడు మన జీవితాలు ధన్యమౌతాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ నిత్య - సత్యమును గమనించి, ఆ విధంగా తమ జీవితములను తీర్చిదిద్దుకొని, ధర్మాచరణమునే చేసి సర్వ శ్రేయముల పొందుదురుగాక.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.
|| ॐ नमः पार्वती पतये हरहरमहदेव ||
https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి