7, అక్టోబర్ 2020, బుధవారం

ఆవలి తీరం వైపు

  ఇప్పుడు మీరు ఏ జీవితం జీవిస్తున్నారో, ఆ జీవితాన్ని ఒక స్వప్నంగా భావించి జీవించినట్లయితే, అప్పుడు ఆవలి తీరం వైపు మీ యాత్ర సాగగలదు. నిజానికి మీరు పరమాత్మ తో ఒకటి అవ్వాలనే అనుభవము పొందడానికి యాత్ర ప్రారంభించినట్లయితే, ఈ జీవితం మీకు స్వప్న సాదృశ్యమే అవుతుంది.. ఎప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో, అప్పుడు ఆ సాక్షాత్కారం పొందినవాడు ఉండడు, భగవంతుడే ఉంటాడు.


కేవలం కుతూహలం మాత్రమే కాక జీవితం అమూలాగ్రం రూపాంతరం చెందాలి అనే ప్రేరణ నిండినవాడు జ్ఞాని. ఎవరికి తెలుసుకోవడం అనేది కుతూహలం కాక, జీవన్మరణ సమస్య అవుతుందో, అతడు జ్ఞాని. ధనం కోసం కాకుండా, దుఃఖం యొక్క కారణం కాకుండా, ఎటువంటి కుతూహలం లేకుండా, జీవన సత్యాన్ని తెలుసుకోమని ఎవరికి పిలుపు వస్తుందో, ఎవరికి ఆ దాహం కలుగుతుందో, ఏది లేకుండా బ్రతకడం కష్టం అని ఎవరికి అనిపిస్తుందో, అతడు జ్ఞాని.


బ్రహ్మమును పొందాలి అంటే అన్ని వాసనలను వదలి వేయాలి. ఇది పరమాత్మ షరతు. పరమాత్మని అన్వేషించే యాత్ర, ఏ పేరుతో ప్రారంభించినా, అందులో శ్రద్ధ ఉంటేనే అది మహాత్వపూర్ణమైనది అవుతుంది.

కామెంట్‌లు లేవు: