7, అక్టోబర్ 2020, బుధవారం

మెకాలే

 




మెకాలే కోసం.


Indian Penal Code (IPC) కి ఇవాళ్టితో 160 ఏళ్ళు.


ఐపిసి రూపకర్త

అనేక దేశాల చట్టాలని అధ్యయనం చేసి దేశంలో

జరిగే రకరకాల వంచనలకి అడ్డుకట్ట వేసి నిందితులకి శిక్షలు వేసే సమగ్ర చట్టాన్ని ఆవిష్కరించిన వాడు

లార్డ్ మెకాలే.


దేశంలో

ఇంగ్లీషు విద్యని ప్రవేశపెట్టిన మహోన్నత మానవుడు మెకాలే.


నిజానికి

ఈ చట్టాలు లేకుంటే ఈ దేశపు మత మైనారిటీల నుంచి శూద్రుల వరకూ

అత్యంత హేయమైన బానిసత్వాన్ని మోస్తూ ప్రాచీన రోమ్ ని తలపించేవాళ్ళు.


ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేకుంటే

జ్ఞాన తిరస్కరణతో

మట్టి కింద చరిత్ర కప్పబడి కనీస చరిత్రకే దూరమయ్యే వాళ్ళం.


కుల మత ఉన్మాదం తలకెక్కి ఊరేగే ఎవడికైనా

చదువు విలువ

చట్టాల విలువ తెలిసే అవకాశం లేదు.

అందుకే 

చట్టాలు మారుస్తాం అంటారు.

ఆ చట్టాన్ని ఆచరించడంలో గడ్డిపోచంత కృషి చేయనివాడికి

చట్టం మీద దుర్మార్గ కామెంట్ చేసే రోగం ప్రసాదించేది

ఇక్కడి కుల మతోన్మాదం.


చట్టాలని క్రియాశీలం చేయడం

కావాలనే మర్చిపోయిన శక్తులు

చట్టాలని మారుస్తామని కూయడం

చరిత్రని వెనక్కి నడిపించాలని చూడటం.


మనుషులంతా సమానం అని భావించడానికి

ఇక్కడి కులమతాలు వ్యతిరేకం.

కులమతాల బురదలో మునిగితేలుతూ ఆ బురదనే ఆరగించే సన్నాసులకి చట్టాలు, దేశాలు, మెకాలేలు శత్రువులు.

వాళ్లే కాదు సమత్వం కోరే ప్రతి మనిషీ శత్రువే.


అందుకే వాళ్ళు

ప్రశ్నని బోనులో నెడుతారు.

ప్రశ్నించే వేళ్ళని కత్తిరిస్తారు.

ప్రశ్నని ధరించే మనుషుల్ని చంపేస్తారు.

ప్రశ్నకి 

స్వరం ఇచ్చే గొంతుల్ని నులిమేస్తారు.


ప్రశ్నతో

ఈ గోళం వెలుగు సంతరించుకున్న సత్యం వాడికి అవసరం లేదు.


వెలుగు 

సమానత్వం వాడికి శత్రువు.


వెలుగు

సమానత్వంని కోరని చవటలు 

ఇప్పుడు

చట్టాలని మారుస్తున్నాయి.

Dunna Ambedkar

కామెంట్‌లు లేవు: