🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*
*****
*శ్లో:- త్రివిధం నరక స్యేదం ౹*
*ద్వారం నాశన మాత్మనః ౹*
*కామః క్రోధ స్తథా లోభః ౹*
*తస్మా దేత త్త్రయం త్యజేత్౹౹*
*****
*భా:- అరిషడ్వర్గములో అతి కీలకమైన కామము, క్రోధము, లోభము అనే యీ మూడును నరకమునకు ప్రవేశ ద్వారములు. ఇవి ఆత్మ నాశన హేతువులు. లోభము సకల పాపాలకు కారణంగా చెబుతారు. ఆ లోభము వల్లనే కామము కలుగుతుంది. ఆ కామము తీరకపోతే క్రోధం పుడుతుంది. దుర్యోధనుని పరమ లోభితనమే అఖండ రాజ్యరమ పట్ల తీరని కామానికి, దాయాదులైన పాండవుల యెడ తీవ్ర క్రోధానికి దారితీసింది. ఫలితం కౌరవ సామ్రాజ్య పతనం. వంశ నాశనం. ఆత్మ వినాశనం. విశ్వామిత్రుడు, దుర్వాసుడు తమ క్రోధం వల్ల అమూల్యమైన తపోబలం కోల్పోయారు. జమదగ్ని క్రోధానికి భార్య బలి కాబడింది. అతి కామానికి లంకేశుడు హతుడైనాడు. నాడు, నేడు మానవుని అథోగతికి , సామాజిక పతనానికి, పరస్పర ద్వేషానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యీ మూడే కారణమౌతున్నాయి. తత్ ఫలితంగా మానవతా విలువలు నానాటికి అణగారి, దిగజారి పోతున్నాయి. కాన సత్సంగం, సద్గ్రంథ పఠనము , సచ్చింతనలతో ప్రతి ఒక్కరు కామ క్రోధ లోభములను నిర్మూలించు కోగలగాలి. అప్పుడే మానవ జన్మ సఫలత. సార్ధకత. పారమార్థికత.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి