7, అక్టోబర్ 2020, బుధవారం

చిత్త నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో చిత్త నక్షత్రము 14వది. చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు. గణము రాక్షస. జంతువు పులి. వృక్షము తాటి చెట్టు. రాశ్యధిపతులు బుధుడు, శుక్రుడు. అధిదేవత త్వష్ట. చిత్తానక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదము - సింహరాశి, రెండవ పాదము - కన్యారాశి, మూడవ పాదము - తులారాశి, నాలుగవ పాదము - వృశ్చికరాశిలో ఉంటాయి.


చిత్త నక్షత్రము మొదటి పాదము 

చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. వీరు రాక్షసగణ ప్రధానులు. ఆవేశం, అతిశయం, పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ జాతకులకు ఆరు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది.. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహుదశలో ఉన్న ఉరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 24 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే 40 సంవత్సరాలకు వచ్చే 19 సంవత్సరాల శనిదశలో ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా కొనసాగుతుంది.


ఇక వీరికి విద్యుత్, అగ్ని, భూ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. యునియన్ లీడర్లుగా ఉండడమంటే వీరు ఆసక్తి. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. నిర్వహణ సామర్ధ్యం కూడా అధికమే.


చిత్త నక్షత్రము రెండవ పాదము 

చిత్తా నక్షత్ర రెండవ పాదము వీరు ఆవేశం, పట్టుదల వీరికి అత్యధికం. నాలుగు సంవత్సరాలకు రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధించాలి. రాహు దశలో ఉన్న సొంత ఊరుకు దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలు అధికం. 22 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా పోది చేసుకోవాలి. లేదంటే 38 సంవత్సరాలకు వచ్చే శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 57 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.


ఇక ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీరికి అనుకులిస్తుంది. వీరు మేధావంతులు, ఆవేశపూరితులుగా ఉంటారు. కనుక సైనిక పరమైన వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.


చిత్త నక్షత్రము మూడవ పాదము 

 చిత్త నక్షత్ర మూడవ పాదము వీరు వీర విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళా రంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. స్టంట్ ఆర్టిస్ట్ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంది. వీరికి పట్టుదల అధికం. ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 3 సంవత్సరాలకు రాహు దశ వస్తుంది. కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.


వీరికి కూడా రాహుదశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసే అవకాశాలున్నాయి. 21 సంవత్సరాలకు గురు దశ వస్తుంది. కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. సంపాదించినది దాచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే 37 సంవత్సరాలకు వచ్చే శనిదశ లో ఖర్చులు అధికమవుతాయి. ఈ కారణాల వల్ల ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 56 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సుఖంగా సాగుతుంది.


చిత్త నక్షత్ర నాలువ పాదము

వీరు రాక్షసగణ ప్రధానులు. విరు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు సైనిక పరమైన ఉద్యోగాలమతే బాగా రాణించగల అవకాశం బాగా ఉంది. భూ సంబంధిత సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అత్యధికంగా అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తరువాత రాహుదశ వస్తుంది కనుక 18 సంవత్సరాల రాహుదశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా విద్యలో విజయం సాధించాలి.


19 సంవత్సరాలకు గురుదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. సంపాదించినది జాగ్రత్తగా దాచుకోవాల్సిన పరిస్థితి. లేకుంటే 36 సంవత్సరాలకు వచ్చే శని దశలో ఖర్చులు అధికమవుతాయి కనుక ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. 55 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.


చిత్త నక్షత్రము జాతకుల గుణగణాలు


కుజ గ్రహాధిపత్య నక్షత్రమైన చిత్త నక్షత్రంలో జన్మించిన జాతకులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే తరహా. తన నిర్ణయమే సరైనదని వాదిస్తారు. ఇతరుల ద్వారా సహాయంను పొందే వీరు.. ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. తాను చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తారు. భార్య, లేక ఓ స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించలేరు.


స్థిరాస్థులు వంశపారంపర్యంగా లభించినా.. సొంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. రాజకీయంలో ప్రవేశిస్తే ఉన్నత పదవులను అలంకరించవచ్చే అవకాశం. అంతేకాకుండా సాంకేతిక, వైద్య రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. మంచి సలహాదారులు చెంతనే ఉండటం ద్వారా అధిక లాభాలు పొందుతారు.


ఇక ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: