*కం*
ఎవ్వారల మదిమెచ్చిన
దవ్వారలధర్మమయ్యు ధరణీతలమున్.
చివ్వున నీధర్మంబే
ఎవ్వరికైనను సరియన యేలదు సుజనా.
*భావం*:-- ఓ సుజనా!ఈ భూలోకంలో ఎవరికి నచ్చిన ది వారి ధర్మం గా మారుతుంది. నీకు నచ్చిన దే ఇతరులు కూడా పాటించవలసిన ధర్మం అని చెబితే అది సమంజసం కాదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ**
*కం*
నీమది మెచ్చిన వారికి
నీమనసున స్థానమీయ నెగడుదు వెపుడున్.
నీమది నిను నొచ్చుకొనెడి
యేమరులకు దూరముంచ యెదుగుదు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నీ మనస్సు ను మెచ్చుకునే వారి కి నీ మనస్సు లో స్థానమిస్తే వర్ధిల్లెదవు. నిన్ను నొచ్చుకొనేవారిని నీ మనస్సు నుండి దూరం చేసుకుంటే ఎదగగలవు.
*సందేశం*:-- కొందరు వారి మనసున వేరొకరి ని ఉంచుకుని వారి కి వీరు నచ్చకపోయిననూ వెంట బడెదరు.దాని వలన వీరి జీవితం వ్యర్థ మవుతుంది. కానీ వీరి మనస్సు ను మెచ్చుకొనే వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. వారి పై మమతానురాగాలు పెంచుకుంటే జీవితం లో వర్ధిల్లగలరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి