3, ఆగస్టు 2024, శనివారం

కాశీ

 🪷 _*కాశీ*_ 🪷

             



✳️ అక్కడ పరమేశ్వరుడి అడుగుల ధ్వని బ్రాహ్మీ ముహూర్తంలో వినిపిస్తుందంటారు♪. వేదపఠనాలు, హారతి గీతాలు, శంఖనాదాలు, ఢమరుక ధ్వనులు నిత్యం స్వాగతం పలుకుతుంటాయి♪. అది విశ్వనాథుడి నగరమైన కాశీ! ఆ పక్కనే ఆధ్యాత్మిక రసవాహిని గంగ ప్రవహిస్తుంటుంది♪. గాలిలో ఓంకార ధ్వని వినిపిస్తుంటుంది♪. హోమ జ్వాలలు పరతత్వాన్ని తెలుపుతుంటాయి♪.


✳️ కాశీనగరం ఆధ్యాత్మిక దృశ్యప్రపంచంలో హిమాలయం లాంటిది♪. మోక్షప్రదాయినిగా భావించే ఆ నగరం, సాధకుల పాలిట స్వర్గ ధామం♪. వరుణ, అసి నదుల మధ్య ఉన్న ప్రదేశమే కాశీ. దానికి వారణాసి, ఆనంద కాననం, శివపురి, మహాశ్మశానం, బెనారస్ అనే పేర్లున్నాయి♪. అది సాక్షాత్తు పరమేశ్వరుడి సృష్టి అని 'శివపు రాణం' తెలుపుతోంది♪. అష్టాదశ పురాణాల్లో కాశీ వైభవాన్ని వ్యాసుడు పలుచోట్ల ప్రస్తావించాడు♪.


✳️ కాశీ అంటే 'ప్రకాశించేది' అని అర్థం♪. ఇది ముక్తిక్షేత్రం. 'నేను కాశీ వెళతాను. అక్కడ నివసిస్తాను' అని పలుసార్లు తలచినా శివుడు సంతోషిస్తాడట. జీవులందరికీ మోక్షద్వారం కాశీ, ఇక్కడ మరణించినవారి చెవిలో స్వయంగా విశ్వనాథుడే తారకమంత్రాన్ని ఉపదేశించి కైవల్యప్రాప్తి అనుగ్ర హిస్తాడని 'స్కాందపురాణం' చెబుతోంది•.


✳️ పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడిగా, విశ్వనాథుడిగా కొలువయ్యాడు♪. దేవతాగణాలతో కైలాసంలో పొందే దివ్యానందాన్ని ఇక్కడ పొందుతున్నాడని భక్తులు విశ్వసిస్తారు♪. కాశీనగరాధిపతిగా, రక్షకుడిగా శివాంశతో జన్మించిన కాలభైరవుడు ఇక్కడే ఉన్నాడు♪. ముందుగా దర్శించుకోవాల్సింది. మనసులో మాట విన్నవించుకోవాల్సింది కాలభైరవుడికే♪.


✳️ కాశీ విశ్వనాథుడి ఆలయం బంగారు తాపడం చేసిన గోపురాలతో ఉంటుంది♪. ప్రాంగణమంతా శివలింగాలతో, అభిషేక జలాలతో ప్రకాశిస్తుంటుంది♪. అదే ప్రాంగణంలోని మసీదు, సందర్శకులతో నిండి ఉంటుంది. మతసామరస్యానికి నెలవు ఆ ప్రాంగణం♪. జగన్మాత ఇక్కడ అన్నపూర్ణగా కొలువై ఉంది♪. పుడమిని సుభిక్షం చేసిన వరదాయిని ఆ తల్లి♪. గంగకు అవతలి ఒడ్డు 'వ్యాసకాశీ' గా సుప్రసిద్ధమైంది♪. వ్యాస ప్రతిష్ఠితమైన పరమేశ్వరుడు. ఎత్తుగా ఉండే మందిరంలో కొలువుతీరి కనిపిస్తాడు♪. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడోదైన `విశాలాక్షి' పీఠం ఇక్కడే ఉంది♪.


✳️ లలితాపరమేశ్వరి పరివార దేవతల్లోని వారాహి మాత ఆలయం ఇక్కడ భూగృహంలో ఉంటుంది♪. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని పై నుంచే గవాక్షం ద్వారా దర్శించుకోవాలి♪. 


✳️ చైతన్యస్వరూపానికి నిదర్శనంగా ఇక్కడ తిలభాండేశ్వర్ ఆలయం ఉంది♪. శివలింగం పెద్దగదిలో పట్టేంతగా ఉంటుంది♪. దేశంలోని పెద్దవైన మూడు శివలింగాల్లో ఇదొకటి♪.


✳️ నిత్యమూ - గంగాహారతి ఇచ్చే దశాశ్వమేధ ఘాట్ ఎంతో పేరుపొందింది♪. బ్రహ్మ - ఈ ప్రదేశంలో పది అశ్వమేధయాగాలు చేశాడంటారు♪. ఇక్కడే ఉన్న శీతలమాత ఆలయం ప్రశాంతతకు నిలయం♪. అన్నపూర్ణ, మహాలక్ష్మి పూజలు భక్తిప్రపత్తులతో జరుగుతుంటాయి♪. గంగామాతకు నిత్యమూ ఇచ్చే హారతి, నదుల పట్ల భారతీయుల పూజ్యభావాన్ని వెల్లడిస్తుంది♪.


✳️ భక్తి ముక్తి క్షేత్రంగానే కాక, శక్తి క్షేత్రంగానూ కీర్తి గడించింది కాశీ♪. రాక్షసులను సంహరించిన దుర్గాదేవి ఈ క్షేత్రంలోనే విశ్రాంతి తీసుకున్నదట♪. ఇక్కడే ఆమె స్వయంభువుగా కొలువై ఉంది♪.


✳️ గోస్వామి తులసీదాసు 'రామచరిత మానస్' రాసింది ఇక్కడే♪. అనంతర కాలంలో కాశీలో హనుమాన్ మందిరాల నిర్మాణాలు విస్తృతంగా జరిగాయి♪. ప్రభాతవేళల్లో - కాషాయాంబరధారులైన సాధువులు దండ కమండలాలతో 'హరహర మహాదేవ్' అంటూ విశ్వనాథుడి దర్శనానికి సాగి పోతుండటం ఓ మనోహర దృశ్యం♪.


✳️ కాశీ పండితుడు, కాశీ విద్వత్ సభ, కాశీలో విద్యాభ్యాసం, కాశీరాజుల సత్కారాలు... అని గొప్పగా చెప్పుకొంటారు♪. కాశీరాజు ఇచ్చిన విరాళ స్థలంలో బెనారస్ విశ్వవిద్యాలయాన్ని పండిత మదన్మోహన్ మాలవ్య స్థాపించారు♪. ఇందులో నిర్మించిన విశ్వనాథ మందిరం సుందరమైంది♪.


✳️ బుద్ధుడు మొదటగా ధర్మ ప్రవచనం చేసిన 'సారనాథ్' ఇక్కడే ఉంది. ఇక్కడి గ్రామదేవత గవ్వలమ్మ.. ఆమెను దర్శించి, యాత్రికుల సంపూర్ణ యాత్రాఫలసిద్ధి పొందుతారు♪.


✳️ ఘనచరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతల కాశీ. దీని దర్శనం వల్ల కలిగే అనుభూతి భావనగా మారి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది♪.



        ❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🚩

కామెంట్‌లు లేవు: