🕉 *మన గుడి : నెం 398*
⚜ *కర్నాటక : - మైసూరు*
⚜ *శ్రీ చాముండేశ్వరి ఆలయం*
💠 అవనికి ధర్మరక్షణ ఛత్రాలు అష్టాదశ శక్తిపీఠాలు. మైసూరులో 4వ శక్తి పీఠంగా, మహోగ్ర శక్తితత్వానికి ప్రతీకగా అలరారుతున్నది శ్రీ చాముండేశ్వరీదేవి, అమ్మకొలువైన కొండను చాముండీ హిల్స్ అని పిలుస్తారు.
💠 మహిషాసురుడు పాలించిన సామ్రాజ్యానికి రాజధాని మైసూరు మహనగరం.
పురణాలలో ఈ నగరాన్ని కౌంచపట్టణం అని, అమ్మ కొలువైన కొండను క్రౌంచగిరి అని ప్రస్తావించారు.
💠 పార్వతీదేవి శరీర ఖండాలు ఒక్కోచోట, ఒక్కో శక్తిపీఠంగా వెలిసాయి అనే విషయాలు మనకు తెలిసిందే. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. ఇది నాలుగవ శక్తిపీఠం అయింది. ఇక్కడ శ్రీ చాముండేశ్వరిగా అమ్మ కొలువుదీరి ఉంది.
💠 మహిషాసురుడు బ్రహ్మచే వరాలు. పొందటానికి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగడం, చావులేని వరం కోరుకోవడటం, ఇది సాధ్యపడదని బ్రహ్మ చెప్పటం ఆడవారు అబలలు కాబట్టి మగవారి చేతిలో నాకు చావు లేకుండా వరం కావాలని అడగటం, బ్రహ్మ సరే అనడం విదితమే ఆ వరబల గర్వంతో దివిని, భూవిని సంపూర్ణంగా జయించి, దేవతలకు దేవేంద్రుడికి నిలువ నీడ లేకుండా చేయటం ఇలా మహిషాసురుడి ఆగడాలు మితిమీరిపోయాయి.
💠 మహర్షులను, మునులను, తపః సంపన్నులను సంహరించసాగాడు. యజ్ఞయగాదులు జరగకుండా అడ్డుకున్నాడు. ఇలా వాడి బాధలు పడలేక సమస్త దేవ దేవతలు, బ్రహ్మవిష్ణు మహేశ్వరులతో మొరపెట్టుకున్నారు, వారి ముగ్గురి నుంచి ఒక ప్రచండ తేజస్సు వెలుపలికి వచ్చింది.
💠 శివతేజస్సుతో ముఖం, విష్ణు తేజస్సుతో 18 బాహువులు, బ్రహ్మ తేజస్సుతో పాదాలు ఏర్పడ్డాయి.
ఇలా ఒక మహశక్తి ఆవిర్భవించింది.
ఆమే చాముండేశ్వరీ దేవి.
💠 అష్టదిక్పాలకులు సర్వ దేవతలు అమ్మకు వాహనం సింహంగా, అమ్మ చేతి ఆయుధాలుగా మారారు.
త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, చక్రం, శంఖం, గద, ధనస్సు విల్లంబులు గండ్రగొడ్డలి.
ఇలా దివ్యాయుధాలతో అక్కడి నుండి కదలి మహిషుడిని సంహరించటానికి బయలుదేరింది.
💠 మహిషాసురుడితో 9 రోజులపాటు భీకరంగా యుద్ధం చేసి 9వ రోజున, మహిషాసురుడిని సంహరిచింది.
రాక్షసుడి పాలననుంచి సమస్తలోకాల విముక్తి పొందాయి.
దేవీ దేవతలు, క్రౌంచ పట్టణ ప్రజలు అమ్మను ఇక్కడే ఉండి పోవలసిందిగా ప్రార్థించారు.
వారి అభ్యర్థన మేరకు ఇక్కడి క్రౌంచ గిరిపై అమ్మ శ్రీచాముండేశ్వరిగా కొలువుదీరి పూజలందుకుంటున్నది.
💠 ప్రంచడమైన తేజస్సుతో రాక్షసులకు రుద్ర రూపిణియై, భక్తులకు అనుగ్రహమూర్తియై, క్రౌంచగిరిని తన స్థిర నివాసం చేసుకున్నది. జీవితంలో ఒక్కసారైన ఈ అమ్మను దర్శించుకొని తీరవలసినదే.
అమ్మదర్శనం చేసుకుంటే చాలు జీవితంలో నెరవేరని కోరిక అంటూ ఏమి మిగలదు.
💠 12వ శతాబ్దంలో హోయసల పాలకులు, అమ్మకు పూర్తిగా నూతన ఆలయాన్ని నిర్మించారు. విజయనగర రాజులు 17వ శతాబ్ధంలో అమ్మ ఆలయంలో కొన్ని పునర్నిర్మాణాలు చేశారు. అందరి రాజుల వలనే విజయనగరం రాజు అమ్మవారికి వెలకట్టలేని నవరత్న ఖచితమైన వజ్రాభరణాలు సమర్పించారు.
💠 ఇక్కడ అమ్మవారు కూర్చున్న భంగిమలో 8 చేతులతో దివ్యాయుధాలతో కాంతి మండల రాసిగా గర్భాలయంలో దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మదర్శనానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు.
💠 మైసురు మహారాజుల వంశీయులే నేటికి మైసూరు మహారాజు శ్రీచాముండీ శక్తి పీఠానికి ధర్మ కర్తలుగా కొనసాగుతున్నారు.
ఈ తల్లియే వారికి కులదేవత.
💠 ఆ ప్రదేశాన్ని తరువాత మహిషూరు (మహిష ప్రదేశం) అని పిలిచేవారు.
బ్రిటిష్ వారు దీనిని మైసూర్‌గా మార్చారు మరియు తరువాత మైసూరుగా కన్నడీకరించారు.
💠 ఆషాఢ మాసంలో , శుక్రవారాలు ముఖ్యంగా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
ఈ సందర్భంగా ఆలయానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
ఈ మాసంలో జరుపుకునే మరో పండుగ చాముండి జయంతి. మైసూర్ మహారాజు అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించిన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు .
ఈ సందర్భంగా బంగారు పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని ఆలయం చుట్టూ తిప్పారు.
💠 ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ నవరాత్రి . మైసూరు దసరాను కన్నడలో నాద హబ్బా (నాడా పండా) అని పిలిచే కర్ణాటక రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు.
నవరాత్రి సమయంలో, నవదుర్గాలుగా పిలువబడే దేవత యొక్క 9 విభిన్న కోణాలను వర్ణించేందుకు విగ్రహాన్ని 9 రకాలుగా అలంకరిస్తారు.
నవరాత్రి 7వ రోజున , మహారాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలను విగ్రహాన్ని అలంకరించడానికి ఆలయానికి ఇస్తారు.
💠 చాముండి కొండలపై మరికొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి మరియు వాటిలో 'నంది' ఏకశిలా విగ్రహం కూడా ఉంది.
నంది శివుని వాహనం. 15 అడుగుల ఎత్తు మరియు 24 అడుగుల పొడవు ఉండే ఒక ఏకశిలాను కనుగొనవచ్చు.
ఎద్దుపై చెక్కిన గంటలు మరియు దండల వరుసలను గమనించవచ్చు,
💠 చాముండి ఆలయం వైపు వెళుతున్నప్పుడు, 'మహిషాసుర' విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది.
💠 మైసూరు సిటీ బస్టాండ్ నుండి చాముండేశ్వరి ఆలయానికి ప్రతి 20 నిమిషాలకు KSRTC బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి