3, ఆగస్టు 2024, శనివారం

మన మతం

 

మన మతం అనగానే అదేదో మతం  అని  అనుకుంటున్నారుఅందుకే మన మతం గూర్చి వివరిస్తున్నాను

మన మతానికి  క్రింది నియమాలు వున్నాయి

1)దైవ  అభేద త్వం: అంటే మనం అందరం శివ, కేశవ అబేధంగా వర్తించడం అని అర్థంఅనగా శివునిపై ఇష్టం ఉన్నవారు శివుని, అలాగే విష్ణువుపై ఇష్టం ఉన్నవారు విష్ణువును ఆరాధించవచ్చు, కానీ శివుని ఆరాధించే వారు విష్ణువును అలాగే విష్ణువును ఆరాధించేవారు శివుని యెడల అబేధంగా అంటే వేరుగా చూడకుండా ఉండటంనిజానికి భాగవతుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవటానికి ప్రాధమిక మార్గంగా సగుణోపాసన కాబట్టి రూపంలో కొలిచినా మన అంతిమ లక్ష్యం నిర్గుణ బ్రహ్మను చేరుకోవడమే

2)  ప్రాతఃకాలంలో నిద్రలేవటం: విధిగా ప్రతివారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవ వలెను. కాలకృత్యాలను ముగించుకొని తిలక ధారణ చేసి ఇష్టదైవాన్ని అర్చించటం. నిత్యం ఇంట్లో దూప, దీప, నైవేద్యాదులు భగవంతునికి అర్పింపవలెను

3)  ఇంట్లో పిల్లలుకూడా వారి వాయి స్తాయిని పట్టి తప్పకుండ నిత్యం భగవదారాధనలో పాలు పంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వటం

4)  మానవ అభేదత్వం: సర్వ మానవులు పరమేశ్వరుని స్వరూపంగా భావించి అందరిని నిన్ను నీవు చూసుకునే విధంగా చూసుకోవటం

5)  స్త్రీ, పురుష అభేదత్వం : మీకు ఎదురుగా వున్నది స్త్రీ అయినా పురుషుడు అయినా ఇద్దరినీ సమ భావంతో చూడటం. ఇది సాధకులు అలవరచుకోవలసిన ఒక ముఖ్య లక్షణంఎప్పుడైతే నీవు న్త్రీ పురుష అభేదత్వన్ని ఆచరిస్తావో అప్పుడు అందరిలో భగవంతుని చూడగలవు

6)  నమస్కరించటం: కనపడిన ప్రతివారినీ రెండు చేతులు జోడించి నమస్కరించటం. ఇది కొంత ప్రయత్నంతో సాధించవచ్చు. చిన్నవారిని నమస్కరించటం ఏమిటి అని అనుకుంటారునిజానికి జగత్తులో చిన్నవారు, పెద్దవారు అని లేనే లేదు. భూమిమీద రావటంలో మనకు చిన్నా పెద్ద అనే తేడా కనిపిస్తుందికానీ నిజానికి ప్రతి మనిషిలోని పరమాత్మకు వయస్సుతో సంబంధం లేదుఅతడు చిరంజీవి అనంతుడు. సర్వజ్న్యుడు 

7)   వినయశీలత: ప్రతివారితోటి వినయంగా ప్రవర్తించవలెను. నాకు అన్నీ తెలుసు అనే భావనను పూర్తిగా విడనాడవలెను. ఎందుకంటె నీకు నీవు ఏది తెలుసు అని అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా తెలిసినవారు అనేకులు నీ ప్రక్కన ఉండి వుంటారు జగత్తులో సర్వము తెలిసినవాడు కేవలం ఈశ్వరుడు ఒక్కడే నిజం మనకు సదా స్పృహలో ఉండాలి

8)  నిగర్వంగా ఉండటం: నేను ఐశ్వర్యపరుడను భూమి మీద దేనినయినా కొనగలను అనే ఆలోచన అస్సలు ఉండరాదునీవు ధనవంతుడవు అయితే నీ ధనంతో పలువురికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. జగత్తులోని ఐశ్వర్యం పూర్తిగా ఈశ్వరునిదే అయి వున్నదినేను నాది అని అనుకునేది కేవలం నేను కొద్దీ కాలం అనియూభావించటానికి మాత్రమే కానీ నేను దేనికి యజమానిని కాను అనే సత్యం తెలుసుకొని వర్తించాలి

9)  బంధాలు: మనము సామాన్యంగా వివాహం వలన, పుట్టుక వలన బంధాలను ఏర్పరచుకొని వాటి చుట్టూ గిరిగీసుకొని ప్రవర్తిస్తుంటాముకానీ నిజానికి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పార్వతి పరమేశ్వరులు మాత్రమే జగత్ మాత జగత్ పిత అంటే అందరికి తల్లిదండ్రులు వారే కానీ వేరొకరు కాదు. ఎదుకంటే మనలో నిక్షిప్తంగా వున్న నేను అనబడే చెతన్యస్వరూపుడు వారి సంతానం మాత్రమే కాబట్టి జగత్తులో వున్న సర్వ జీవరాశి కూడా నాకు సోదర సోదరీమణులు అనే భావం కలిగి ఉండాలి

10.  నేను చూసే ఈ దృశ్యమాన జగత్తు పూర్తిగా ఆ ఈశ్వరునిచే నిర్మించి ఈశ్వరునిచే ఆవరించి వున్నది. 

11. నాది ఏది లేదు: నేను నాది అని అనుకునేది అది ఇల్లు వాకిలి కావచ్చు లేక పొలము పుట్రా కావచ్చు లేక నగలు నట్రా ఇంకా వస్తు వాహనాలు నేను కొనుక్కున్నాను నాకు సంక్రమించాయి అనేవి కేవలము మిధ్య నిజానికి నేను వాటిని కొంతకాలము అంటే నా శరీరం వున్నంతవరకు మాత్రమే అనుభవించే ఒక కిరాయిదారుడిని మాత్రమే అనే భావము కలిగి ఉండాలి. 

12. అకర్త భావన: నేను చేసే ఏ పనికూడా నేను కర్తను కాను కర్త కేవలము పరమేశ్వరుడు మాత్రమే ఆ ప్రభువు నా తో ఆయా పనులు చేయిస్తున్నాడు అనే భావన కలిగి ఉండాలి

ఆచరించవలసినవి

నియమాలు కొంత కఠినంగా ఉంటాయి కానీ అసాధ్యం మాత్రము కాదు

1. దేహవ్యామోహం: దేహవ్యామోహం తగ్గించుకోవాలి అందుకు ఏమి చేయాలి అంటే నేను దేహాన్ని కాదు దేహిని మాత్రం అనే భావం కలిగి శరీరాన్ని కేవలము మోక్ష సాధనకు పనికి వచ్చు ఉపకరణంగా మాత్రం భావించి శరీర వ్యాపారాలు చేయాలి. ఏవిధంగా అయితే ఒక పనిమంతుడు తన పనికి పనికి వచ్చు పరికరాలు చేసుకుంటాడో అలాగేశరీరాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలి కానీ శరీరాన్ని అందంగా ఉండాలని అనుకోకూడదు, అంటే వివిధ లేపనాలు పూసుకోవటం, కేశాలను అలంకరించుకోవడం మొదలైనవి

2. వస్త్రధారణ: వస్త్రాలు కేవలం శరీరానికి ఆశ్చాదనగా మాత్రం స్వీకరించాలి. అందమైన అలంకరణలు, ఖరీదైన వస్త్రాలు, వస్తువులు పొంది ఉంటే మనస్సు వాటితో అనుబంధం ఏర్పరచుకొని మనస్సు భగవంతుని నుంచి దూరంగా వెడలుతుందినన్ను ఏది కట్టి పడవేయదు అని భావిస్తే ఏవి వున్నా అవి నిన్ను ఏమి చేయలేవు

3. నేను ఆచరించే నియమాలు నా మనస్సుకు నచ్చాయి కాబట్టి ఎవ్వరితో అంటే ఈ ప్రపంచంతో నిమిత్తం లేకుండా నన్ను నేను ఉద్దరించుకోవటానికి మాత్రమే అనే భావన కలిగి అకుంఠితంగా నిరంతరం నియమాలకు కట్టుబడి జీవనం చేయాలి.

మతాన్ని నిర్దేశించిన గురుదేవులు ఎవరు అంటే ఇంకా ఎవరు శ్రీ ఆది శంకర భగవతపాదులువారిని అనుసరిద్దామువారు  ఏర్పాటు చేసిన మార్గమే మనకు సర్వదా శిరోధార్యం.  

ఓం శాంతి శాంతి శాంతిహి 

ఇట్లు 

మీ

మీ భార్గవ శర్మ   

మతాన్నిమేము ఆచరించదలిచాము అని అనేవారు మీ సమ్మతిని కామెంటులో తెలుపండి. 

నాకు ఈ నియమాలు పూర్తిగా నచ్చాయి ఈ రోజునుంచి నేను మనస్ఫూర్తిగా ఆచరిస్తాను, నా తోటివారితో ఆచరింప చేస్తాను అని మీరు కామెంటులో పేర్కొనండి. ఒక్క విషయం మీ పేరు ఫోను నెంబరు వ్రాయటం మరువ వద్దు. 

 

కామెంట్‌లు లేవు: