*_సూపర్ స్టార్ వచ్చాడు..!_*
తేనెమనసులు విడుదలై
అరవై ఏళ్ళు..31.03.1965
______________________
మూగమనసులు..
మంచిమనసులు..
కన్నెమనసులు..
మనసుల మీద ఇన్ని సినిమాలు తీసిన దిగ్దర్శకుడు
ఆదుర్తి సుబ్బారావు..
మూగమనసులు
అంతటి సూపర్ హిట్ సినిమా రూపొందించిన తర్వాత
ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో ఒక ప్రయోగానికి సిద్ధపడ్డారు.అందరూ కొత్తవాళ్లతో సినిమా నిర్మాణానికి సాహసించారు..
ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం కంటే తెలుగు చిత్ర పరిశ్రమకు
ఒక విశిష్ట వ్యక్తిని అందించింది.
ఆ సినిమా ప్రయోగం వల్ల పరిశ్రమలోకి వచ్చిన కొత్త హీరో
తదనంతర కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తానే ప్రయోగాలకు చిరునామాగా మారిపోయాడు.ఆయనే తెలుగు సినీమా గమనాన్ని మార్చాడు..కొత్త అడుగులు వేయించాడు.తెలుగు సినిమాని కౌబాయ్ సినిమాల వైపు నడిపించాడు..సినిమా స్కోప్ సొగసులు అద్దాడు..
భారీతనాన్ని సమకూర్చాడు.
చివరకు 70 ఎం ఎం హంగులు కూడా అందించాడు.తెలుగు సినిమా స్టేటస్ పెంచాడు..తెలుగు నిర్మాతల గౌరవాన్ని ఇనుమడింపచేశాడు..వీటన్నిటి ద్వారా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలిపించుకున్నాడు..సూపర్ స్టార్ గా ఎదిగి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు చిత్రపరిశ్రమ మూల స్తంభాల్లో ఒకడిగా సిరపడ్డాడు..
ఆయనే ఘట్టమనేని
శివరామ కృష్ణ..
ఉరఫ్ సూపర్ స్టార్ కృష్ణ..!
*_తేనెమనసులు_*
ఈ సినిమాని అందరూ కొత్తవాళ్లతో తియ్యడానికి ఆదుర్తి సిద్ధపడినపుడు ఆయన భుజం పట్టుకుని వెనక్కి లాగాలని ప్రయత్నించింది ఎందరో..
మూగమనసులు వంటి సూపర్ హిట్ సినిమాని అద్భుతమైన పాటలు.. కధా కథనంతో భారీ తారాగణంతో తీసి సక్సెస్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా అవసరమా అని చాలా మంది పెదవి విరిచారు.అయితే అప్పటికే ముళ్ళపూడి అందించిన కథను నమ్మిన సుబ్బారావు ఆ కధతో సినిమా తీసినప్పుడు పెద్ద నటులు అవసరం లేదని..కొత్తవారితో తీసినా చాలని భావించి కొత్తనటుల ఎంపికకే సిద్ధపడ్డారు.ప్రకటన వెలువడింది..ఎంపిక కమిటీలో మహానటుడు.. ఆదుర్తి ప్రియమితృడు అక్కినేని
ఉన్నారు..ఆయనే కృష్ణ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అంతకు ముందే ఆయన కృష్ణను చూసి ఉన్నారు.
ఎంపికలో ఆయనే తుది ముద్ర వేసేశారు..ఇంకేమి..ఒక గొప్ప
సంచలనానికి బీజాలు పడ్డాయి..కృష్ణతో పాటు హీరోగా రామ్మోహన్ కూడా ఎంపికయ్యాడు.జయలలిత..హేమామాలిని వంటి వారు కూడా ఎంపికకు హాజరైనా కృష్ణకు జంటగా సుకన్య..
రామ్మోహన్ కు జోడీగా సంధ్యారాణి ఎంపికయ్యారు.
సినిమా నిర్మాణం మొదలైన తర్వాత కృష్ణ నటన అంత బాగా లేదని..తీసెయ్యాలని
పంపిణీదారులు పట్టుబట్టినా కూడా ఆదుర్తి లొంగకపోగా అప్పటివరకు తీసిన బ్లాక్ అండ్ వైట్ పార్టును పక్కన బెట్టి కలర్లో తీయడం మొదలెట్టారు.చక్కని పాటలతో .. చిత్రీకరణతో నడిచిన తేనెమనసులు సూపర్ హిట్ అయింది.
అందులో మరో హీరో రామ్మోహన్ అచ్చం దేవానంద్ లా ఉన్నాడని అతనికి మంచి భవిషత్తు ఉంటుందని కొందరు
అనుకున్నా ఆ అంచనాలు తిరగబడ్డాయి.. మిగిలిన కథ మామూలు కథ కాదు..తెలుగు సినిమా సరికొత్త చరిత్ర..ఒక నూతన అధ్యాయం..
తదనంతర కాలంలో రామ్మోహన్ పాత్రలు లేకుండా ఇబ్బంది పడుతున్న దశలో అప్పటికే పెద్ద హీరోగా..నిర్మాతగా ఎదిగిన కృష్ణ ఒకనాటి తన సహచర కొత్త హీరోకి తన సినిమాలు
పండంటికాపురం..
పాడిపంటలు వంటి ఎన్నో సినిమాల్లో అవకాశాలు కల్పించి ఆదుకున్నారు..
అంతే కాదు..తన గురువు..తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మాయదారి మల్లిగాడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ఆయనకు మంచి పేరు..అఖండ లాభాలు సమకూర్చాడు.అంతేకాదు సుబ్బారావు మొదలు పెట్టి నిర్మాణం జరుగుతుండగానే మరణిస్తే గాజుల కృష్ణయ్య సినిమాను పూర్తి చేసి గురువు రుణం తీర్చుకున్నారు.
అలా ఒక గొప్ప సినిమా తేనెమమసులు విడుదలై అరవై ఏళ్ళు పూర్తయ్యాయంటే కృష్ణ పరిశ్రమకు వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినట్టే.
అంతకు ముందు ఒక సినిమాలో అక్కినేని పెళ్లి సీనులో వెనక కృష్ణని చూసినట్టు గుర్తు..
తేనెమనసులు మాత్రం తెలుగు చిత్రపరిశ్రమకు ఒక లెజెండు ను పరిచయం చేసి ఆ రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది..
*_సూపర్ స్టార్ మొదటి సినిమాగా..!_*
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
*_సురేష్..9948546286_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి