రాజమార్గంలో వెళుతున్న కృష్ణపరమాత్మను చూడడానికి ద్వారక ప్రజలకు రెండు కళ్లూ చాలడం లేదు.
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ, జామరం
బులతోఁ, బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతుఁ డై
నలినీభాంధవుతో, శశిధ్వజముతో, నక్షత్రసంఘంబుతో,
బలభిచ్ఛాపముతోఁ, దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్..
**
ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, కపిలవర్ణము గల అంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.
చిన్నగా ...శ్రీకృష్ణుడు జననీజనకుల సౌధానికి వెళ్లాడు. వారికి నమస్కరించాడు.
***
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బా
లొడ్డగిలఁ బ్రేమభరమున
జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా!
***
చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, తల్లులు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లే ఆనంద బాష్పాలతో అతనిని అభిషేకించారు.
🏵️పోతన పదం🏵️
🏵️మాతృ ప్రేమకు వందనం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి