24, సెప్టెంబర్ 2020, గురువారం

హిందూ ధర్మం - 6

 **దశిక రాము**




ధర్మం అంటే?


ధర్మం అనేక అర్ధాలు కలిగిన పదం. ధర్మం అన్న పదం ఒక్క భారతీయసంస్కృతిలోనే ఉంది. హిందూ, జైన, బౌద్ధ, సిక్కు గ్రంధాల్లో ధర్మం అన్న పదం తరచూ కనిపిస్తుంది. ధర్మం అన్న పదానికి చాలా విశాలమైన అర్ధం ఉంది. ఎంత విశాలమైన అర్దం అంటే మూములు మనిషి యొక్క మనసు, ధర్మం యొక్క అర్ధాన్ని అంత సులభంగా అర్దం చేసుకోలేనంతగా. ధర్మానికి ఋగ్ వేదంలో 20 రకాల అర్ధాలను చెప్పారు. ధర్మం అన్న పదానికి సమానమైన పదం మరే భాషలోనూ లేదు. 


ధర్మం 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, ధర్మానికి ఆచరించబడేది, పాటించబడేది, సమస్త సృష్టికి ఆధారభూతమైనది అనే అర్ధాలున్నాయి. ఇవే కాక, కర్తవ్యం, విధి, శాసనం, సరైన మార్గం, ఆచారం, న్యాయం వంటి అర్ధాలున్నా, ఇవన్నీ ఒక్కొక్కటిగా ధర్మాన్ని వివరించడంలో అసంపూర్ణాలే. సాధరణంగా చెప్పవలసి వస్తే, ధర్మం అనగా సరైన/అసలుసిసలైన జీవన విధానం. మానవులు ఎలా బ్రతకడం వలన, సృష్టికి ధర్మాలకు అనుగుణంగా, సులభంగా, సుఖంగా జీవనం సాగించగలరో, అదే ధర్మం.  


ఈ ధర్మం అనే మాటకు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు అర్ధాలు అన్వయం అవుతాయి. ధర్మం అంటే స్థిరమైనది, ఎప్పటికి నశించనది అని కుడా చెప్తారు. ఈ జగత్తు మొత్తం సవ్యంగా నడవడానికి ఆధరభూతమైన దానిని, ఈ సృష్టిని గందరగోళం లేకుండా, సవ్యంగా నడిపించే వ్యవస్థను ధర్మం అన్నారు.


ఈ సృష్టిలో భిన్నత్వాల సమూహం. రకరకాల వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన విధానాలు ఉన్నా, సూక్ష్మంలోకి వెళ్తే అన్నిటి యందు ఏకత్వం ఉంది. ఆ ఏకత్వమే చైతన్యం. ధర్మం కూడా అంతే. అన్ని జరుగుతున్నా, అన్ని కారణాలు వెనుక ఒక పెద్ద కారణం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అన్నిటిని నడిపిస్తున్నది, అన్నీ దాన్ని అనుసరించే జరుగుతాయి. అదే ధర్మం.  


తరువాయి భాగం రేపు


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95

కామెంట్‌లు లేవు: