24, సెప్టెంబర్ 2020, గురువారం

మోహముద్గరము

  


                రచన

గోపాలుని మధుసూదన రావు


తనకు ముందట చలి మంట , తరణి వెనుక 

గడ్డమున కాలు కలసిన కాళ రాత్రి 

భిక్ష అరచేత, వాసంబు వృక్షఛాయ 

అయిన యంతంబుకావాశ లతనియందు 16



ఘనముగా సేయ స్నానంబు గంగయందు 

అరయ వ్రతదానములనెన్ని యాచరించ 

జ్ఞానహీనతనుండిన జనుడు ముక్తి 

వందజన్మలకైనను పొందలేడు 17


దేవగృహములు , తరునీడ ,తృప్తినుండ 

అజనచర్మపుధారణ ,యవనిపడక ,

సర్వ సుఖభవత్యాగముల్ ,సతతముండ 

అరయ వైరాగ్య మీయదె అట్టి సుఖము ! 18


యోగిగానున్న సంసారభోగిగున్న 

వంటరిగనున్న వసుధలో జంటగున్న 

చిత్తమెవరిది బ్రహ్మను జేరియుండు 

ఆతడానందమయునిగా ననయముండు 19


కోరి చదువంగ గీతను కొంచమైన 

గంగనీరంబు గ్రోలగ కణముయైన 

ఒక్కసారైన భజియించ నొనరహరిని 

చర్చయుండదు జమునితో జన్మయందు 20

కామెంట్‌లు లేవు: