🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
*శ్లో:- దుర్జనేన సమం వైరం ౹*
*ప్రీతించా౽పి న కారయేత్ ౹*
*ఉష్ణో దాహతి చాంగార: ౹*
*శీతః కృష్ణాయతే కరమ్ ౹౹*
*****
*భా:- మనసు, మాట, చేతలలో పొంతన లేకుండా యథేచ్ఛగా ప్రవర్తించే వానిని "దుర్జనుడు" అంటారు. వాని మనసులో అపకారచింతన, మాటల్లో పారుష్యము, పనులలో నమ్మక ద్రోహము పరులకు కంటక ప్రాయముగా ఉంటాయి. అలాంటి దుర్జనునితో నెయ్యము గాని, కయ్యము గాని చేయడం మంచిది కాదు. దుర్జనుడు బొగ్గు లాంటి వాడు. బొగ్గులు ఎర్రగా మండేటప్పుడు పట్టుకుంటే చేతులు కాలిపోతాయి. పోనీ చల్లారిన తరువాత పట్టుకుంటే చేతులనిండా మసి అంటుకుంటుంది. అందుకే వానితో స్నేహము , వైరము రెండూ మంచివి కావు. దానవీరశూర కర్ణుడు దుర్యోధనాదుల మైత్రీబంధంతో అకృత్యాలకు పాల్పడి, పాపం మూట కట్టుకోవలసి వచ్చింది. రామమహిమ నాకళింపు చేసికొన్న మారీచుడు రావణుని చెలిమితో ప్రాణత్యాగానికి సిద్ధపడవలసివచ్చింది. "దుర్జనం ప్రథమం వందే౹ సుజనం తదనంతరమ్౹౹° అంటారు పెద్దలు. సభలో గాని, సమావేశాలలో గాని, నడి వీధిలోగాని ముందుగా దుర్జనునికి నమస్కారం పెడితే వాడు మన జోలికి రానేరాడు. ప్రశాంత జీవనంచేయవచ్చును*.
******
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి