*దశిక రాము**
*దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా*/
*మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే*//...
ఏలయనగా దైవ సంబంధమైనదియు, త్రిగుణాత్మికమైనదియును అగు ఈ నా యొక్క మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయిననూ ఎవరు నన్నే శరణుబొందు చున్నారో, వారు ఈ మాయను దాటి వేయగలరు.
అఖండము,వ్యాపకము, నిత్యము అయిన పరమాత్మను మరచి నామరూప పదార్థాలను నిజమని నమ్ముట 'మాయ'. దేహి అగు ఆత్మ తాననుకోవటం,దేహము నేననుకోవడం 'మాయ'. మాయ అంటే ముందు ఉండి తర్వాత పోతుందని అనుకోరాదు. నిజంగా లేకపోయినా కానవచ్చేది మాయ.మాయ నుండి తప్పించుకునే మార్గం ఈ శ్లోకంలో భగవానుడు చెప్పినాడు.
🙏*శుభోదయం*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి