8, సెప్టెంబర్ 2021, బుధవారం

గోమాత విశిష్టత

 గోమాత విశిష్టత

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు.

గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం.

గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ

ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని

పనులు ప్రారంభించదం ఎంతో

శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ

పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు

చెబుతున్నవి.

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు

ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ

ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా

ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు.

గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ

ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల

వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ,

యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం

చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ

ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ

జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు

అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ

ప్రశంసించబడింది.

ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ,

విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన

తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి

వున్నాయి. శిరస్సుకు మధ్యబాగం శంకరుని

గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు

ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది.

ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి

గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ

జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద

చూడలేదు అని చ్యవన మహర్షి ‘నహుషం’లో

ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక, హిందూ

ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది

పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా

అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు,

బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురు

నానక్, శంకరాచార్యులు తులసీదాసు, కబీరు,

చైతన్య మహాప్రభువు మొదలగు

మహానుభావులెందరో గోసంపద యొక్క

రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు.

శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను

పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి

తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం

వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం

చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.

గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ

” శ్రీ కృష్ణ పరమాత్మ” గోవును ఎంతో భక్తి తో

శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. మహా

జనులారా గోవును పూజించిన ముక్తికి

పొందెదరు.

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని

భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక

ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను,

బ్రాహ్మణులను, భక్తులను దూషించిన

దోషం, పరులను హింసించిన దోషం,

పరులను హింసించిన పాపం ఏ విధముగా

పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా

దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ!

గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి

గోవును పూజించిన సర్వపాపములు

నశించును. ఆ గోవునందు పాదములు

ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి

దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ

కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక

నాలుగు వేదములు, భ్రూమధ్యంబున

గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున

శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో

సూర్య చంద్రులు, చెవులలో శంఖు-

చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు

ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున

సరస్వతి, రొమ్మున నవగ్రహాలు,

మూపురమున బ్రహ్మదేవుడు,

గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును.

ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర,

వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు.

ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు,

తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య

కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి

త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు

పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు

పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త

సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు

నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం,

అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత

గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు

తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద

ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు

కన్నా గొప్పది. కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య

వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా

పాతకములన్నియు తొలగును. ప్రతి

అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల

మహాపాపములు తొలగును. నిత్యము

సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము

కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా

పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు

తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు,

బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి

పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి

ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు

ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం.

గోవును పూజించితే సమస్త దేవుళ్ళను

పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో

ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి

మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ

చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి

పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు.

కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ

రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి

పుణ్యములు పొంది 41 రోజులు చేసిన

పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో

పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

" శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ

తత్తుల్యం రామనామ వరాననే "

గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి ,

మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని

పంచ గవ్యములు అంటారు.

ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక

పూట భోజనాన్ని ఇస్తుందట.

భూ మాత గో రూపంలో నే దర్శనమిస్తుందని శ్రీ

మద్భాగవతం లో ఉంది.

గోవు యొక్క సమస్త అంగములందు సమస్త

దేవతలు కలరు. అందుకే ఆవును

ముందు ప్రవేశ పెట్టి, ఆ తర్వాతనే నూతన

గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.

గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33కోట్ల

మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.

గో పూజ,గోరక్షణ,గోదానం,గో వధ నిషేధం ప్రతి

హిందువు కర్తవ్యం.

తల్లి పాల వలె సులభంగా జీర్ణం అయ్యే శక్తి

ఆవు పాలల్లో ఉంది. ఆవు పాలు

సంపూర్ణాహారము. శిశువులకు,

వృద్ధులకు చాల శ్రేష్ఠం. క్రొవ్వు

ఉండదు. ఆవు పాలలో ప్రోటీనులు ,

కార్బోహైడ్రేట్లు , ఖనిజాలు, విటమినులు ,

మెగ్నీషియం , క్లోరిన్ మొదలగు లోహాలు ఉన్నాయి.

నీరు త్రాగుతున్న గోవును, పాలు

తాగుతున్న దూడను వారించకూడదు(అడ్

డు పడకూడదు).

గోవు తిరుగాడు మన ముంగిళ్ళు,

దేవాలయాలను తలపించు గుళ్ళు,గోవులు

కదలాడే దేవుళ్ళు…

గోవులను వధించకుండా చూడాలి. గోవులు

జీవించి ఉండాలి. ఆయుర్వేదం లో విష

పదార్ధాలను గో మూత్రంతో శుద్ధి చేస్తారు.

భోపాల్ విష వాయువు వచ్చిన సమయం లో ఒక

ఇంట్లో విష వాయువులు ఎమీ చేయలేకపోయాయట.

కారణం ఎమిటో తెలుసా..? ఆ ఇంట్లో ఆవు పేడతో

యజ్ఞం చేశారు కాబట్టి.

దేశం మొత్తమ్మీద 6.27 లక్షల గ్రామాల్లో ప్రతి

గ్రామంలో 50 రైతు కుటుంబాల్లో ఒక్కొక్క

కుటుంబానికి 2 ఎద్దులు, 4 పాడి ఆవులు

ఉంటే వాటి ద్వార లభించే పేడ దేశం మొత్తానికి

కావాల్సిన పెట్రోల్, యల్.పి.జి, కిరోసీన్ , యల్.ఎన్.జి

అవసరాలను తీరుస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ

బాగుపడుతుంది.

గో మూత్రం ఒక లీటర్ 120 రూపాయలు. పేడ కిలో

15 రూపాయలు అమ్ముతుంది మహరాష్ట్రలోని

వెడప్ కాషా అనే సంస్థ. ఈ సంస్థ కేవలం 3 గోవుల

ద్వారా 60000 విలువ చేసే సేంద్రియ

ఎరువులను , 250000 విలువ చేసే

అగరుబత్తులను తయారు చేసి సంచలనం

సృష్టించింది.

గో మూత్రం వల్ల భూ సారం 20 శాతం

అభివృద్ధి చెందుతుంది. ఒక గ్రాము

గోమయంలో 300 కోట్ల సూక్ష్మ జీవులు

ఉంటాయి. అవి భూసారాన్ని పెంచుతాయి.

ఆవుకి నమస్కరిస్తే ధర్మం నాలుగు పాదాల

నడుస్తుంది. మంగళం కొరే మానవుడు

ఆవులకు ఎల్లప్పుడూ నమస్కరించడం

అవసరం. ఆవు పృష్టానికి నమస్కరించడం

శ్రేయోదాయకమని స్రీ సూక్తం లో చెప్పబడింది.

గోవు భారత ఆర్ధిక వ్యవస్థ లో కీలకము.

భారతీయులు వ్యవసాయం మీద ఆధార పడితే , ఆ

వ్యవసాయ భారాన్ని తమ భుజాలపైన మోస్తున్నవి

ఎద్దులు. ఆలాంటి ఎడ్లనించ్చేది గోవులే.

అందుకే ఆవు మనకు అమ్మ. ఎద్దు మనకు

అన్న.

గో బ్రాహ్మణ హింస జరిగే చోట అబద్దమాడవలసి వచ్చి

అబద్దమాడినా దోషం లేదని వ్యాస భారతం చెప్పింది.

ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను

దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల

గోవును దానం చేస్తే ఏడు తరాలను

తరింపజేస్తుంది. గో దానం చేస్తే పితృ

దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని

శాస్రంలో చెప్పబడింది.

ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రొజున గో పద్మ

వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం

కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది.

ఎండ వల్ల, వడ గాడ్పులప్పుడు , చలి

గాలులు వీస్తున్నప్పుడు , వర్షం

వచ్చినప్పుదు ముందుగా నిన్ను నువ్వు

రక్షించుకోవడం కాదు గోవును రక్షించు.

గో పోషణ కొరకు పరుల గడ్డి వామిలోంచి గడ్డి

తీసుకొని ఆవుకు వేస్తే అది దొంగతనం కాదు.

జాతి పిత గాంధీజి నాకు స్వాతంత్ర్యం కంటే గో

రక్షణే ప్రధానమన్నారు.

భూమాతకు ఆభరణం గోమాత,

ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది.

తరతరాల భారతీయ భూతదయ పరంపరకు సజీవ

సాక్ష్యం గోమాత

గోసేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్య

ఫలం

గోసంపద ఉన్నచో అది అర్ధ బలం,

గోమూత్రం పుణ్య జలం.

గోక్షీరం పసిపాపలకు తల్లి పాల బలం.

గోవును పూజించిన చాలు నశించును మన

పాపాలు సకలం.

గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు.

పల్లెలలో గో సంతతి ఎప్పుడైతే తగ్గుతుందో

అప్పుడే పల్లే ప్రజలు పల్లెల్ను విడిచిపోతారు.

గోపాలుడు పుట్టిన భరతదేశం లో గోవులకు

రక్షణ లేకుండా పోయింది. గో హత్యలు

పెరిగిపోతున్నాయి. గోహత్యలు నిషేదించాలి.

గోహత్యలు చేసిన వారికి కఠిన శిక్షలు

వేయాలి.దీనికోసం చట్టం తెచ్చేవరకు

మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వం పై

ఒత్తిడి తేవాలి.

మొగలి పువ్వును,ఆవును శివుడు

శపించాడా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు,తమలో తము

"నేను గొప్ప అంటే నేను గొప్ప" అని

వాదించుకున్నారు.ఈ వాదులాట కాస్త వివాదంగా

మారింది.అది మరింతగా పెరిగి యుద్దానికి

దారితీసింది.ఈ యుద్దానికి లోకాలన్నీ తల్లడిల్లాయి.దా

ంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి

దిగాలనుకొన్నాడు.ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద

జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య

వెలసింది.బ్రహ్మ విష్ణువులు ఇద్దరు

లింగాన్ని సమీపించారు.అప్పటి వరకు వారి మధ్య

ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా

సద్దుమణిగింది.ఆ మహా లింగం మొదలు,తుది

తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది.బ్రహ్మ

హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని

చూడడానికి,విష్ణువు వరాహ రుపమలో అదిని

కనుక్కోవడానికి బయలు దేరాడు.బ్రహ్మకు

ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని

కనిపించలేదు.ఇంతలో లింగం పక్క నుంచి

ఒక కేతక పుష్పం(మొగలి పువ్వు) జారి

కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని

అపితనకు,బ్రహ్మకు,విష్ణువుకు నడుమ

జరిగిన వాదాన్ని వివరించి,సహాయం చేయమని

అడిగాడు. ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ

లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా,విష

్ణువుతో చెప్పేటప్పుడుఅది నిజమేనని సాక్ష్యం

ఇమ్మని ప్రాదేయపడ్డాడు.సాక్షాత్తు సృష్టి

కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక

సరేనంటాను.రెండు,కిందకు దిగి వచ్చే సారికి

విష్ణువు తాను ఆ లింగం మొదలు

చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు.బ్రహ్మ

తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని ,కావాలంటే

అవును, మొగలి పువ్వును అడగమని

చెప్పాడు..నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ

దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర

భాగాన్ని చూసాడని ఆవు తలతో చెబుతుంది

కాని,అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో

చూడలేదని చెబుతుంది.బ్రహ్మ దేవుడి

అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు

ప్రతయ్యక్షమయ్యాడు.బ్రహ్మ చెప్పిన ప్రకారం

అబద్దపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో

భక్తులెవ్వరు తనను పూజించరాదని ,తెల్లవారి

లేచి ఆవు ముఖం చూడటం కుడా పాప

కారణం అని

శపించాడు.ఆవు అభ్యర్దన మేరకు తోకతో నిజం

చెప్పింది కాబట్టి వృష్టభాగం పవిత్రమైనది....

కామెంట్‌లు లేవు: