```దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు
80 వేల కోట్లు అయిందని గగ్గోలుపెడుతున్న
నాస్తిక సంఘాలు !
-------------------------'
అదేమరి మా గొప్పతనం.
ఇప్పటికైనా తెలిసిందా
హిందువుల పండుగల విలువ!
ఈ మా పండగ వల్ల వివిధ కులవృత్తులవారికి అందరికీ
ఈ 80 వేల కోట్ల రూపాయల డబ్బు వారి ఇండ్లకు చేరింది.
వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి,
వారి సహాయకులైన,
వారికి మట్టి అందించే వారికి,
రంగులు అమ్మేవారికి,రంగులు వేసే వారికి..
మ్యాదర సోదరులు తాటాకు/ వెదురు కర్రలతో వేసే
తాత్కాలిక మంటపాలు ద్వారా
మరియు
షామియానా వారు వేసే టెంట్లు ద్వారా
వారికి వారికి ఉపాధి దొరికింది.
సన్నాయి, బ్యాండ్ మేళం వారికి.
లోపల డెకరేషన్ చేసే వారికి,
క్లాత్ వర్క్ చేసే టైలర్ లకు పని దొరికింది.
పువ్వులు పంటల వారికి, కోసే వారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి
దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా
అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి.
ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి
విగ్రహాలు మంటపాలకు తేవటానికి,
మరల నిమజ్జనానికి తీసుకువెల్లటానికి
అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి.
దాదాపు ప్రతి మంటపం లో అన్నదానాలు జరుగుతాయి.
కలిసి భోజనాలు జరుగుతాయి..
సమాజం లో సామరస్యత పెరుగుతుంది.
ప్రతి ఒక్కరూ కడుపునిండా తినగల్గుతారు..
వంట మనుషులకు, సహాయకులుకు,
టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది.
వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే
వారికి మంచి ధర కు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు.
బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది.
(వీరిని ఎప్పుడో మనం పట్టించుకోవటం మానేసాం కదా!)
ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది.
కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు,
పూజచేసే పత్రి, మామిడాకులు ఇలా వీటిన్నటినీ
ఈ రోజుల్లో కొనటమే కనక సన్నకారు రైతులు అందరూ
వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది.
హరికధలు బుర్రకధలు నాటకాలు ప్రవచనాలు,
భరతనాట్యాలు సంగీత కచేరీలు ఆర్కెష్ట్రాలు,
ఊరేగింపులలో కోయడాన్సులు భేతాల నృత్యాలు కోలాటాలు,
తీన్మారులు తాసాలు రామడోళ్లు నాదస్వర డోలు సహనాయిలు,
చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు
ఈ వినాయకచవితి పేరుచెప్పకుని తనకుటుంబంతో కలసి
తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే.
ఆఖరికి కూలిపనికి వెళ్లేవారు కూడా
నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో,
షెడ్ లకు రాడ్ లు ఎత్తే పనికో,
పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో, పోతే
నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది
కూడా ఈవినాయకచవితి కోసమే.
నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపల నుంచే అంటే అతిశయోక్తి కాదు.
ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం , ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశ పెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే మాకు చాలా గర్వంగా ఉంది.
నేడు సొంత ప్రభుత్వాలు ఉన్నా గణేశ నవరాత్రులు కు అనుమతులు తీసుకోవటం అంటే ఆత్మ గౌరవం కల్పించలేని లేని రాజ్యం లో ఉన్నామనే భావన కలుగుతుంది.
ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే
మనంమాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో
ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్ధంకాదు.
మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న
లోకహితమైన లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు.
ప్రతి పండగ మనకు ఒక్కో మేలును కల్గిస్తు
ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
ప్రతి ఒక్క కులమూ గొప్పదే ..
ఏ కులం లేకుండా మరొక కొలం మనుగడ సాగించలేదు.
గమనిక:- కులం అంటే వృత్తి.
మా భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం
అనే సిద్దాంతం దాగి ఉంది.
అర్థం కాని వారుఒక ఏడాది పాటు వెయిట్ చేసి,
ఒకే ఒక్క పండగ జరుపుకుంటూ
ఆర్థిక మాంద్యం బారిన పడే వివిధ దేశాల
ఆర్థిక విధానాల మీద పరిశోధన చేసి చూస్తే
ఇక వారు మా పండగల జోలికి రారు.
చివరిగా ఒకమాట....
మాపండగలలో ధనం ధర్మ భద్దంగా
చందాల రూపం లో సేకరించి
అందరికీ పంచ బడుతుంది.
మాకు దోపిడీ చేసి ధనాన్ని పంచే రాబిన్ హుడ్ ల అవసరం పడదు!
కానుకలు పంచే తాతయ్యల అవసరం లేదు.
మాకు మేము పని కల్పించుకుని
సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మంమాది.
జై భారతం జైజై హైందవం```.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి