*వృద్దాప్యం రాకముందే భగవంతుని పూజించాలి*
శ్రీ నీలకంఠ దీక్షితుల వారు ఈ విధంగా చెప్పారు.... *అయి ప్రధచేతః పరమముపదేశం చృణు*
*మమ స్మరారేరర్షయం బాదుషు కరణేషు స్మర* *పాలమ్ I*
“ఓ మనిషీ!మీ కోసం నా దగ్గర ఒక మంచి సలహా ఉన్నది వినండి, దాన్ని పాటించండి! అన్ని ఇంద్రియాలు సంపూర్ణంగా ఉన్నప్పుడే భగవంతుని పూజించగలవు, ఆరాధించగలవు అంటాడు.ఎందుకంటే తన శక్తి అంతా పోయిన తర్వాత ఎవరైనా గుడికి వెళ్లాలనుకున్నా వెళ్లలేరు.మహాశివరాత్రి నాడు కళ్లని నిద్ర ఆవహించకుండా చేసి, మెలకువగా శివపూజ చేయాలన్నా, శ్రీకృష్ణాష్టమి నాడు అర్ధరాత్రి వరకు పూజ చేయాలన్నా కుదరదు. అందుచేత కృతార్థుడు కావాలనుకుంటే, ఇంద్రియాలన్నీ సంపూర్ణంగా ఉన్న సమయంలో భగవత్ ఆరాధన, భగవత్ సేవ మొదలైన వాటిని చేయాలి. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహాన్ని ఆయన సేవలకే వినియోగించే విధంగా అనుక్షణం కాపాడుకోవడం మనబాధ్యతే. అందులోని ఏ ఒక్క భాగాన్నయినా నిర్జీవంగా చేస్తేమాత్రం పాప కూపంలోకి నెట్టివేయబడతారు మానవులు. అందుకే, జీవితంలో ఆనందాన్ని పొందాలంటే భగవత్పదులవారి ఆదేశం ప్రకారం వృద్ధాప్యం రాకముందే భగవంతుడిని పూజించాలి. వృద్ధాప్యంలో కూడా భాగవత్ప్రసాద ద్దేహాన్ని తన నియంత్రణలో ఉంచుకుని, అన్ని అవయవాలు భగవత్ సేవకే నిరంతరం వినియోగిపబడేవారికి మోక్షప్ర్రాప్తి ప్రసాదిస్తాడు భగవంతుడు.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి