20, అక్టోబర్ 2024, ఆదివారం

శివో అభిషేక ప్రియ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *శివో అభిషేక ప్రియ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శివో అభిషేక ప్రియః। అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!*


*"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి* 

*పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు* 

*గామధేనువు వానింట గాడి పసర*

*మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు॥"* 


*తాత్పర్యము:~*


*శివ లింగంపై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!*


*శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !!*

*సకలైశ్వర్యములు సమకూరతాయి !!*


*నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు.* 


*విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: