20, అక్టోబర్ 2024, ఆదివారం

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1646 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-281. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

దీప నిర్యాణ గంధం చ 

సుహృద్వాక్య మరుంధతీంl

న జిఘ్రంతి న శృణ్వంతి 

న పశ్యంతి గతాయుష:ll


తేటగీతి:

అరయగా చావు మూడినయట్టి వారు 

దీప నిర్యాణ గంధమున్ తెలియలేరు 

చెవిని పెట్టరు వినుటకై చెలుని మాట 

ఘన యరుంధతీ రిక్కను గాంచలేరు.


భావం: చావు మూడినవారు దీప నిర్యాణ గంధమును పసిగట్టరు. మిత్రవాక్యమును చెవిని పెట్టరు. అరుంధతీ నక్షత్రమును చూడలేరని పెద్దలు చెబుతారు.

కామెంట్‌లు లేవు: