26, జూన్ 2023, సోమవారం

ఘటస్థ - పటస్థ

 ఘటస్థ - పటస్థ


పరమాచార్య స్వామివారు చెక్కబల్లకు ఆనుకుని కాళ్ళు చాపుకుని కూర్చుని ఉండటం అందరూ చూసే అద్భుత దృశ్యం. ముఖ్యంగా స్వామివారు మేనాలో కూర్చుని దర్శనం ఇస్తున్నప్పుడు స్వామివారు కాళ్ళు చాపుకునే ఉంటారు.

“మహాస్వామి వారు కళ్ళు పెట్టుకోవడానికి ఒక మెత్తటి పాదపీఠం తయారుచేస్తే ఎలా ఉంటుంది?”


వెంటనే రబ్బరుతో తయారుచేసిన తేలికగా, మెత్తగా ఉన్న స్పాంజిని తీసుకుని వచ్చి పెద్దగా వలయాకారంగా కత్తిరించాను. దాన్ని వెల్వెట్టు గుడ్డతో కప్పి, ఎనిమిడ్ దళాల కమలం పువ్వు ఆకారంలో కుట్టాను. మధ్యలో వేరొక రంగుతో కుట్టి, చుట్టూతా లేసుతో చెక్కగా అలంకరించాను.


నేను స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మేనాలో కూర్చుని ఉన్నారు.


నేను మా అమ్మగారు కలిసి స్పాంజితో చేసిన పాదపీఠాన్ని పరమాచార్య స్వామి వారికి సమర్పించాము (మేనా ముందర ఉన్న నేలపైన పెట్టాము). వెంటనే స్వామివారు “అష్టాదళం” అని అన్నారు. మేనా లోపల నుండి కాళ్ళను బయటకు తీసి, ఆ పాదపీఠంపై ఉంచారు. మాకు అంతో సంతోషం కలిగింది. ఇద్దరమూ పులకించిపోయాము. స్వామివారు “సరే అక్కడ ఉంచి వెళ్ళండి” అని అనకుండా భక్తితో సమర్పించిన ఆ పాదపీఠాన్ని తము స్వీకరిస్తున్నట్టుగా వెంటనే తమ పాదాలతో పావనం చేశారు. ఇంతకంటే భాగ్యం ఏముంటుంది?

పక్కనే ఒక సేవకుడు నిలబడి ఉన్నారు. “లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం తెలుసునా?” అని అడిగారు స్వామివారు.


ఒక నిముషం పాటు ఆలోచించి, “అరుణాం కరుణా తరంగితాక్షీం . . .” మొదలుపెట్టాడు ఆ సేవకుడు.


“వేరొకటి”


“సింధూరారుణ విగ్రహాం . . .”


“హా అదే! చూడు, అక్కడ ఒక పండితుడు నిలబడి ఉన్నాడు కదా! తన వద్దకు వెళ్లి ఈ శ్లోకంలో వచ్చే ‘రత్నఘటస్థ-రక్తచరణాం’ అన్నదానికి అర్థం అడుగు” అని ఆదేశించారు.


ఆ సేవకుడు పండితుని వద్దకు వెళ్లి తిరిగొచ్చి స్వామివారితో ఇలా చెప్పాడు. “దాని అర్థాన్ని ఆయన, ‘అమ్మవారు తన ఎర్రని పాదాలను అమూల్యమైన రత్నములచే చెయ్యబడిన నీటి కుండపై ఉంచింది’ అని చెప్పారు పెరియవా”.

మేనా పక్కనే మరొక్క పండితుడు ఉన్నాడు. అతనివైపు చూసి మహాస్వామి వారు, “శాస్త్రిగారూ! చాలాకాలం నుండి నాకు ఒక సందేహం ఉంది. అదేంటంటే, ‘ఎందుకు అమ్మవారు తన పాదాలను ఘటం పైన ఉంచింది? అది ఇక్కడ అంత సరి లేదు అనిపిస్తోంది కదా?’” అని అన్నారు.


అందుకు ఆ పండితుడు అవునన్నట్టు తల పంకించాడు. “మరి దానికి నీవు ఏమని వివరణ ఇస్తావు” అని స్వామివారి నుండి అడిగించదలుచుకోలేదు ఆ పండితుడు.


“అది ఇక్కడ అంత అర్థవంతంగా లేదు కదా?”


“అవును పెరియవా”


“ఇప్పుడు ఈ పాదపీఠాన్ని చూడడంతో నా అనుమానం నివృత్తి అయ్యింది” అని స్వామివారు ఇలా విశ్లేషించారు.


“అమ్మవారు తన ఎర్రని పాదాలను ఇటువంటి పాదపీఠంపై ఉంచారు అన్నది సరిగ్గా ఉంటుంది. ‘ఘటస్థ’ అని ఉన్న చోట ‘పటస్థ’ అని ఉంచితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ‘పటం’ అంటే బట్ట, అంటే మెత్తని పాదపీఠం. ఈ పదము ముందు ‘పాటస్థ’ అనే ఉన్నదేమో, అది వాడుకలో ‘ఘటస్థ’ అయి ఉండవచ్చు అని నా ఆలోచన. కాబట్టి మనమ ‘పాటస్థ’ అంటే ‘బట్టపై’ అంటే ‘మెత్తని ఉన్ని బట్టపై’(ఎందుకంటే అది అమ్మవారి లేలేత పాదాలకు ఇబ్బంది పెట్టదు) అనే సమ వాచకాన్ని మనం తీసుకోవాలి.”


ఇది విన మాకు కలిగిన ఆశ్చర్యానందాల నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది.


ఈ వెల్వెట్ పాదపీఠం!


ఏ అర్హతా లేని, ఏమీ తెలియని నా సమర్పణ వల్ల మహాస్వామివారి అనుమానం నివృత్తి అయినది అని చెప్పటం ఒక్క పరమాచార్య స్వామివారికే సాధ్యం.

పరమాచార్య స్వామివారు కరుణ, ఆనందం వల్ల హృదయం ద్రవమై కళ్ళ నుండి వచ్చే నీరు, రెండూ ఆక్కడితో ఆగలేదు.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: