20, అక్టోబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 59*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 59*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం*

*చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |*

*య మారుహ్య ద్రుహ్య త్యవని రథ మర్కేందుచరణం*

*మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే ‖*


స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం = అమ్మా పద్మరాగపుటద్దాల వలె వున్న చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్న నీ తాటంకములు సూర్య, చంద్ర రూపాలు.


చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ = చెవులకున్న తాటంకములు రెండు, ప్రతిబింబిస్తున్నవి రెండు, వెరసి నాలుగు రథ చక్రాలుగా, శివునిపై పుష్పబాణ ప్రయోగం చేయటానికి మన్మధుడు రథియై కూర్చున్నట్లుందమ్మా నీ ముఖ పద్మము. 


యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం = సూర్య చంద్రులే చక్రములుగా అవని అనే రధాన్ని తయారు చేసుకొన్నాడు మన్మధుడు. అంటే అమ్మవారి ఫాలభాగం భూమి వలె విశాలంగా వున్నదని.


మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే = ఆ విధంగా మన్మధుడు బయలుదేరాడు.శివుడు సూర్యచంద్రులను రధచక్రాలుగా చేసుకొని, భూమి అనే రథంపై, త్రిపురాసుర సంహారం కోసం వెడలినట్లుగా.


మన్మధుని తన త్రినేత్రంతో దహించి శివుడు వెళ్ళిపోయాక, రతీ మన్మధుల ప్రార్థనపై పార్వతి అతడిని తన కనుచూపుల కొసల నుండి, అనంగునిగా (శరీరము లేనివాడుగా,రతీ దేవికి మాత్రమే కనబడునట్లుగా) తిరిగి బ్రతికిస్తుంది. అలా అనంగుడైన మన్మధుడు తిరిగి శివునిపై ప్రయోగించటానికి అమ్మవారు తన చెరకు విల్లు నుండి ఒక ధనుస్సునూ, పుష్పబాణముల నుండి బాణములనూ ఇచ్చి పంపారట. వీటితో పాటు అమ్మవారి క్రీగంటి చూపులు, చిరునవ్వులు, బాణములై తపస్సు కోసం వెళ్లిన శివుడిని, ఆమెను వెతుక్కుంటూ స్వయంగా తిరిగి వచ్చేటట్లు చేశాయట.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: