20, అక్టోబర్ 2023, శుక్రవారం

వ ర్ణన మంటే అతిశయోక్తులేనా

 


వ ర్ణన మంటే అతిశయోక్తులేనా? 


(ఆచర్య  చొప్పకట్ల  సత్యనారయణ )


వర్ణ న లనగానే ఆఁయేముందిలెద్దూ? అతిశయోక్తులేగదా! 

అంటారు కొందరు. అవునండీ ఉన్నది ఉన్నట్లు చెపితే అదిమనంమాట్లాడుకునే సంభాషణలో భాగనేగాని కవిత్వం ఞయెలావుతుందీ? కవిత్వమంటే ఒక సౌందర్యాన్ని ఆవిష్కరించటమే! అదిలేనప్పుడు అదికవిత్వ మనిపించుకోదు.

 చేమకూర యీపద్యంలోతనచేవచూపించాడు, పద్యం వినండి!

ఉ: "పున్నమిరేలఁ దత్పురము పొంతనెబో న్ శిఖరాళిదాకి వి 

ఛ్ఛిన్న గతిన్ సుధారసము చింది పయింబడు నంతనుం 

డిన్నెల సన్నగిల్లు; నది నిక్కము; కాదనిరేని, యాపదా 

ర్వన్నె పసిండి మేడలకు రాబనియేమిల? సౌధనామ ముల్!

కవి పాండవ రాజధాని యింద్రప్రస్థపురాన్ని వర్ణిస్తున్నాడు.

 అక్కడున్నవన్నీ సౌధములేనట! అవిఆకాశమంత యెత్తున్నవట! 

వాటికి సౌధనామము యెందుకు యేర్పడినదో యీపద్యంలో చర్చ జరుపుతున్నాడు. ""సుధయీనిర్మిత యితిసౌధమ్"(సున్నముతో కట్టబడినది కావున సౌధమని మామూలుగా వ్యుత్పత్తి. 

అదికాదంటాడు చేమకూర. యెందుకంటే అవి పదునారు వన్నెల బంగారముతో గట్టబడ్డాయి.కాబట్టివీటిని మామూలు గా సౌధమనుటకువీలులేదు. కానీ యీకారణమువలన వాటికి సౌధములని పేరువచ్చిృయుండనోపును, అంటూ ఒకచక్కని కధచెపుతున్నాడు.

పున్నమి రాత్రులలో చంద్రుడు ఈపట్టణంలో ఉన్న యెత్తైన యీ మేడలపై నుండి పోవుచుండగా, భవనముల పైనున్న శిఖరములు అతవిని గాయపరచి యుండనోపును. అపుడాతనిలోని యమృతమంతయు వీమేడలపై కారియండును,ఆయమృత ధారలతో (సుధావర్షమున) తడియుటవలన కాబోలు వీనికి సౌధములను పేరుగల్గినది. లేకున్న నీబమగరు నేడలను సౌధములనుట కెట్లు వీలగును? అనికవియంటాడు.

సౌధమనేమాటకు లోకంలో మేడ యనేఅర్ధం యోగరూఢమైనది. అయినను కారణాంతరములతో దానిని కాదని, వేరొక కారణమును చెప్పుటచే నిందు "నిరుక్తి "యలంకారము చెప్పబడినది.(నిరుక్తిః యోగతోనామ్నా మన్యార్ధత్వప్రకల్పనమ్ - అని లక్షణము)🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: