20, అక్టోబర్ 2023, శుక్రవారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *తృతీయాశ్వాసము*


                      *29*


*శర్మిష్ఠ దేవయానీ*


ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయానివేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి  మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా విఫలం కావడంతో  శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.

కామెంట్‌లు లేవు: