20, అక్టోబర్ 2023, శుక్రవారం

స్వర్ణభస్మము

 స్వర్ణభస్మము గురించి సంపూర్ణ వివరణ -


    

        స్వర్ణం 5 రకాలుగా ఉండును. అవి 


 1 - సహజము .


 2 - ప్రాకృతము .


 3 - వహ్నిజము .


 4 - ఖనిజము .


 5 - సూతవేదజము . 


       బంగారము 16 వన్నెలు కలిగి ప్రకాశించుచుండును. ఇప్పుడు స్వర్ణములులోని రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


   బ్రహ్మాండం అవతల కోడిగుడ్డు ఆకారమున ఉండును. దీనిని "ప్రాకృతం " అని అందురు. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు.


   అగ్నివలన పుట్టినది కావున "వహ్నిజ"అని అంటారు. దీనిని సేవించిన కాయసిద్ధి కలుగును.


  పర్వతముల యందు పుట్టు ( ఖనిజము ) బంగారము సేవించిన సర్వరోగములను హరించును . మేరుపర్వతము పైన పుట్టు బంగారమునకు " సహజము " అని పేరు .


  పాదరసమును రసవాద ప్రక్రియల యందు చెప్పబడిన విధముగా శుద్ధియొనర్చి కొన్ని రహస్య ప్రక్రియలద్వారా బంగారం తయారుచేయుదురు. ఇది వేదముచే కలిగినది కావున " వేదజ " అని పేరువచ్చినది.


          పైనచెప్పబడిన సహజము , వేదజము , ఖనిజము మూడునూ శుద్ది యొనర్చి సేవించిన అమృతముతో సమానమై అది సేవించు మానవులకు సమస్తరోగములను పోగొట్టును . శరీరముకు ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్గాయువును కలుగచేయును .


 * బంగారం యొక్క స్వచ్ఛత లక్షణము -


          బంగారం స్వచ్చమైన ప్రకాశము కలిగి పచ్చగా పొరలు లేక పెళుసుదనము లేకుండా మెత్తదనం , చిక్కదనం మరియు బరువును కలిగి ఉండి ఆకురాయిపై రుద్దిన చక్కని కాంతి కలిగి ఉండి నిప్పున బాగా కాల్చి చల్లార్చిన ఎర్రనై కత్తిరించిన కపిలవర్ణమై ఉండవలెను . అట్టి లక్షణములు కలిగినది ఉత్తమ బంగారము . ఇటువంటి బంగారమును మాత్రమే రసాయనిక ఔషధముల యందు ఉపయోగించవలెను .


 *  స్వర్ణమును శుద్దిచేయు క్రమము -


           నువ్వులనూనె , మజ్జిగ , ఆవుపంచితం , కలి , ఉలవల కషాయం వీని యందు ఒక్కొక దానియందు ఏడుసార్లు ముంచుచూ మరలా ఏడుసార్లు కాల్చుతూ మళ్ళీ ఒక్కొక్కదాని యందు ఏడుసార్లు ముంచుతూ చేసినచో స్వర్ణం శుద్ది అగును.


       ఈ పద్ధతిలో ఒక్క స్వర్ణముకు మాత్రమే కాకుండా అన్నిరకాల లోహాలను శుద్ధిచేయవచ్చు .


 *  స్వర్ణభస్మం తయారుచేయు విధానం -


          16 వన్నెలు కలిగిన స్వచ్చమైన బంగారంను తెచ్చి చాలా పలచటి రేకులుగా మార్చి ఆ రేకుల బరువుకు సమానం అగు రసభస్మమును గ్రహించి మాదిఫల రసములో వేసి బాగుగా నూరి ఆ నూరినదానిని పైన చెప్పిన బంగారు రేకులకు పట్టించి మూకుడు యందు ఉంచి పైన మరొక మూకుడు బోర్లించి లోపలకు ఏమి పోకుండా చుట్టూ చీలమన్ను వేసి ఆవుపిడకలతో పుటము పెట్టవలెను . ఈ విధముగా మూడుసార్లు పుటము పెట్టవలెను . ఇలా మూడుసార్లు పుటం పెట్టటం వలన స్వర్ణపు రేకులు భస్మం అగును. ఆ భస్మమును జాగ్రత్తగా సంగ్రహించి ఆ భస్మమునకు 4 వ వంతు పాదరస భస్మమును కలిపి నిమ్మపండ్ల రసమును పోసి నూరవలెను ఆతరువాత దానిని చిన్నచిన్న బిళ్లలుగా చేసి మళ్ళీ పైనచెప్పిన విధముగా మూకుడులో పెట్టి చీలమన్ను అంటించి 33 సార్లు పుటము పెట్టవలెను . ఇలా పుటములు  పెట్టిన తరువాత స్వర్ణము కుంకుమపువ్వు కాంతి కలిగి సింధూరించి చక్కని భస్మం అగును.


 *  స్వర్ణ సింధూరం గుణములు  -


         పైన చెప్పబడిన విధముగా తయారుచేయబడిన స్వర్ణసింధురం అత్యంత శక్తివంతం అయినది. దీన్ని మించిన గొప్ప ఔషదం మరొక్కటి లేదు శాస్త్రప్రకారముగా దీనిని లోపలికి వాడుచున్న సకల క్షయలు , పూర్వజన్మ పాపములు వలన జనించిన రోగాలు , పిశాచ బాధలు నశించును. అంతులేని శక్తి దేహమంతయు వ్యాపించి అత్యంత శక్తువంతుడు అగును. దేహకాంతి , వీర్యపుష్టి , సూక్ష్మబుద్ధి కలిగించి మనిషికి దీర్గాయుష్షును కలిగించును.


       స్వర్ణభస్మం కేవలం అనుభవవైద్యల  సూచనతో మాత్రమే వాడవలెను . స్వర్ణసింధురం 

మరియు స్వర్ణభస్మం వాడినవారి శరీరం నందు అత్యద్భుతమైన తేజస్సు కలుగును.


 

ఈ స్వర్ణభస్మ సహిత ఔషధము కొరకు నన్ను సంప్రదించగలరు .క్రింద ఇచ్చిన నంబరుకి ఫోన్ చేయగలరు .

    


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: