శరణమప్ప అయ్యప్ప
పరమాచార్య స్వామి వారిని దర్శించడానికి రెండు బస్సుల్లో శబరిమలకు వెళ్ళే భక్తులు వచ్చారు. వారిని స్వామివారు “ఇప్పటిదాకా ఎన్ని పుణ్యక్షేత్రాలు చూశారు? ఇంకా ఏ ఏ క్షేత్రాలు దర్శిద్దామనుకుంటున్నారు?” అని అడిగారు.
వారు ఇప్పటిదాకా యాత్రలో భాగంగా దర్శించిన క్షేత్రాలను చెప్పి, ఇంకా కేరళలోని వైక్కం, గురువాయూర్, చోటానికర దర్శించుకోవాలి అని చెప్పారు. చివరగా శబరిమలకు చేరుకుంటాము అని చెప్పారు.
మహాస్వామివారు కొద్దిసేపు అలోచించి తిరుచ్చిలోని మాతృభూతేశ్వర ఆలయం (రాక్ ఫోర్ట్ దేవాలం శివుడు), తిరువనైక్కావల్ అఖిలాండేశ్వరి, శ్రీరంగం రంగనాథుడు, మధురై మీనాక్షి, తిరుప్పరకుండ్రం మురుగన్, తిరునల్వేలి నెల్లియప్పర్, తిరుకుర్తాళం కుర్తాళనాథర్ ని దర్శించుకుని శబరిమలకు చేరుకొమ్మని ఆదేశించారు.
కాని అందరికీ అలా వెళ్ళడం కుదరక ఒక బస్సువారు మాత్రం పరమాచార్య స్వామివారు చెప్పినట్టు, మరొక బస్సు ముందుగా అనుకున్నట్టు వెళ్ళాలని నిర్ణయించుకుని యాత్రను కొనసాగించారు. పదిరోజుల తరువాత శ్రీమఠానికి వార్త అందింది.
పరమాచార్య స్వామివారు చెప్పినట్టు వెళ్ళిన బస్సు శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ముగించుకుని క్షేమంగా ఊరు చేరింది. కాని మరొక బస్సు మధ్యదారిలోనే అపఘాతానికి గురై చాలామందికి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఒకరో, ఇద్దరో ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి శబరిమల చేరకనే వెనుతిరిగి వెళ్ళిపోయారు.
అలా కాపాడబడినవారు ప్రతి సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా కంచికి విచ్చేసి, మహాస్వామివారిని దర్శించుకుని, స్వామి వద్ద అయ్యప్ప శరణుఘోష చేసి సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వెళ్తారు. శరణుఘోష పూర్తి అయ్యేదాకా స్వామివారు కనులు మూసుకుని ధ్యానమగ్నులై ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
భక్తికి, భక్తులకి ఎప్పుడూ పరమాచార్య స్వామివారి సహాయం తప్పకుండా ఉంటుంది.
_/\_ ఓం స్వామియే శరణం ఆయ్యప్ప || పరమాచార్య తిరువడిగలే శరణం _/\_
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి