రైలు చేసిన హత్యలు.
సాయంత్రం సమయం అది
పట్టాలపై పరిగెత్తుతున్న రైలు
గమ్యం చేరాలనే ప్రయాణికుడు
ఏ తప్పిదమో గతి తప్పింది.
రైలు వెళ్ళే మార్గం మళ్ళింది
లూపు లైనున వెళ్ళింది
అనుకోని ప్రమాదం జరిగింది
మరో రైలును డీకొన్నది.
ఎగసిన బోగీలు ఒకదానిపై మరొకటి
క్షణాలలో మరో రక్త పిపాసిగా మారి
వందల మంది ప్రాణాల్ని బలిగొంది
చరిత్రలో విషాద దినంగా మారింది.
అంతలోనే మరో విపత్కరం
ప్రమాదంతో మరో ప్రమాదం
నేల కూలిన రైలు బోగీలు
పడేను ప్రక్క ట్రాకున..
అంతలో మరో రైలు వచ్చేను.
చూసే లోపే రైలుబండి డీకొనే
చావు రక్కసి విలయం చేసే
మృత్యువు వికటహాసమాయే
అచట విలయతాండవమాడే.
శ్వాసలన్నీ బలిపీఠాన కొట్టుమిట్టాడే
ఎర్రని నెత్తురు వరదయై పారేనే
క్షణ భంగురాన శవాలుగా మారే
ఎందరో క్షతగాత్రులుగా అయ్యే.
రైల్వే చరిత్రలో పెను ప్రమాదం
జాతి మొత్తం విషన్న వదనం
ఊపిరొదిలిన అభాగ్యులు
వారికి అర్పించాలి నివాళులు.
కాదిది తప్పొప్పుల కాలం
సహయ సహాకారాల సమయం
ఆపన్న హస్తాలు చాటు
ఆపదలో అండగా నిలువు.
ఈ విపత్కర సమయంలో
బాధిత కుటుంబాలకు అండగా
మానవత్వం చూపుదాం
మనిషిగా గమనం చేద్దాం.
రైలు చేసిన హత్యల్లో అశువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ..
బాధాతప్త హృదయంతో..
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి