*డాక్టర్స్ కేర్ మాస పత్రిక నుండి వేసవిలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.*
*చెమట రూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి. ఎండ దెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికెలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండ్లకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కొచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకూడదు.. తాగకూడదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?*
*1) మజ్జిగ : వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు... శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.*..
*2) పుదీనా: ఇది మనకు చాలా సులభంగా దొరుకు తుంది. చౌకైనది కూడా. ఇదొక హెల్దీ హెర్బ్. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది*.
*3) ఉల్లిపాయలు: ఉల్లిపాయలో అమేజింగ్ కూలింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . అందుకే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.*
*4) పుచ్చకాయ : వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ పుచ్చకాయ. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది*.
*5) కర్బూజా : వేసవికి మరో బెస్ట్ ఫుడ్ మస్క్ మెలోన్ (కర్బూజా). వేసవిలో డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది*.
*6) జామకాయ: జామకాయలో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి*.
*7) కొబ్బరి బోండాం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలనుs పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది.*
*8) నిమ్మకాయ: శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది*.
*9) కీరదోసకాయ: కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.*
*10) ఫైనాపిల్: ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి* .✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి