*నిజమైన ధనవంతుడు!*
➖➖➖✍️
*”మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?”...బిల్ గేట్సని ఎవరో అడిగారు.*
*”ఒకవ్యక్తి,.... ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు…*
*“నేను డబ్బు, పేరు సంపాదించక ముందు రోజులలో - ఒక నాడు ‘న్యూయార్క్ ఎయిర్ పోర్ట్‘ లో దిగాను.*
*దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపరును అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.*
*“పర్లేదు... మీవద్ద చిల్లర లేక పోయినా, ఈ పేపర్ తీసుకోండి” .... అని బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోకతప్పలేదు.*
*మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా - మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే, దురదృష్టం కొద్దీ అప్పుడూ, నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.*
*ఆ కుర్రాడు నాచేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ ...*
*“ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వల్ల నేనేమీ పెద్దగా నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించు కుంటాను” అన్నాడు.*
*ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను.*
*నెలన్నర తర్వాత అతి కష్టం అతడు దొరికాడు.*
*“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.*
*“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” అన్నాడు.*
*చాలా సంతోషించాను, ఇంతకాలం తర్వాత కూడా నేను గుర్తున్న నందుకు.....*
*ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను“ అన్నాను.*
*“సర్... *
*మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది?” అతడు ప్రశ్నించాడు.*
*“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.*
*“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను.”*
*“ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”*
*క్షణకాలం నామైండ్ బ్లాంక్ అయింది. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.*
*అతడు ఇతరులకు సహాయం చెయ్యాలి అనుకుంటే, తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. *
*అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. *
*అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...*
*ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే - నిజమైన ఐశ్వర్యం.*
*ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి