🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
🌼 *శుభోదయం* 🌺
🌴 *మహనీయులమాట* 🌴
బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే. కానీ అంతఃప్రపంచాన్ని వశం చేసుకోవడం అంతకంటే వీరోచితం.
🌳 *నేటిమంచిమాట* 🌳
బుధ్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలు సాధించగలరు.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 19 - 01 - 2025,
వారం ... భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *పంచమి* ఉ7.03వరకు,
నక్షత్రం : *ఉత్తర* సా5.23 వరకు,
యోగం : *అతిగండ* రా2.07 వరకు,
కరణం : *తైతుల* ఉ7.03 వరకు
తదుపరి *గరజి* రా8.01 వరకు,
వర్జ్యం : *రా2.38 - 4.24,*
దుర్ముహూర్తము : *సా4.15 - 4.59,*
అమృతకాలం : *ఉ9.31 - 11.16,*
రాహుకాలం : *సా4.30 - 6.00,*
యమగండం : *మ12.00 - 1.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.43,
*_నేటి మాట_*
*భగవంతుని అనుగ్రహము*
మానవుడు తాను దేనినైనా పొందగల్గాలంటే తన ప్రయత్నంతో పాటు దైవ సంకల్పము కూడా ఉండి తీరాలి.
మనం ప్రయత్నం చేసినప్పటికీ అంతా దేవుని సంకల్పం ప్రకారమే జరిగి తీరుతుంది.
ఒకవేళ మన ప్రయత్నంతో దేనినైనా పొందగలిగితే అది కూడా పూర్తిగా మన ప్రయత్నం వలన కానే కాదు! మన ప్రయత్నం పట్ల దేవుడు సంతుష్టుడై తన అనుగ్రహం కురిపించుట చేతనే మనం దానిని పొందగలిగాము తప్ప మనమేదో అద్భుతం చేశామని కాదు!!!.
దేవుని సంకల్పం లేనిదే గాలి కూడా వీయదు, గడ్డి కూడా కదలదు..
కనుక నేనే చేశాను, నాదే ఇదంతా, నన్ను మించినవారు లేరు... ఇలాంటి అహంకారం వదిలేసి భగవంతుని యందు భక్తి విశ్వాసాలతో ఉంటూ ఆయన సంకల్ప శక్తిని గుర్తిస్తూ నడుచుకోవాలి.
తద్వారా భగవంతుని అనుగ్రహ, ఆశీస్సులు సదా మనపై ఉంటాయి.
అపుడు మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు.
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి