21, జనవరి 2025, మంగళవారం

అజీర్ణ రోగం

 అజీర్ణ రోగం గురించి సంపూర్ణ వివరణ  - వివిధ రకాల ఆహారాల వలన కలుగు అజీర్ణాలకు విరుగుళ్లు  -


  అజీర్ణం సర్వరోగాలకు మూలకారణం . తినినటువంటి ఆహారం జీర్ణం కాకున్నా అనేక రోగాలు శరీరం నందు సంభంవించును. అజీర్ణవ్యాధికి మందాగ్ని కారణం. ఎక్కువుగా నీరు తాగుట, సమయం కాని సమయంలో భుజించటం భుజించటం, మలమూత్రాలను నిరోధించుట, రాత్రిసమయంలో మేల్కొని పగలు సమయంలో నిద్రించుట , తక్కువుగా భుజించుట  మొదలైన కారణాల వలన మనుష్యునికి ఆహారం జీర్ణం కాక అజీర్ణరోగం కలుగును.


           ఈర్ష్య, భయం , క్రోధము, లోభము , శోకము, దైన్యము, వైరం వంటివి కలిగినప్పుడు భుజించిన అన్నం చక్కగా జీర్ణం కాదు. భుజించిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించినచో అజీర్ణరోగం కలుగును.


  అజీర్ణవ్యాధి నాలుగు  రకాలుగా ఉండును. అవి 


          1 -  ఆమాజీర్ణం .


          2 -  విదగ్ధాజీర్ణం .


          3  -  విష్టబ్దాజీర్ణం.


          4 -  రసాజీర్ణము 

 *  ఆమాజీర్ణ లక్షణాలు  -


       ఆమాజీర్ణం నందు దేహము జడముగా ఉండటం , చెక్కిళ్ళు , కనులు వాచుట , తిన్నది తినినట్లే కక్కుట ఇట్టి లక్షణములు కలుగును .


 *  విదగ్ధాజీర్ణ లక్షణాలు -


        విదగ్ధాజీర్ణం నందు పులిత్రేపులు , భ్రమ , దప్పిక, మూర్చ మొదలగునవి కలుగును. పైత్యవికారం కలుగును. పొగతోకూడిన ఆమ్లసహిత వాంతి అగును. చెమట మరియు తాపము కలుగును.


 *  విష్టబ్దాజీర్ణ లక్షణాలు -


        నొప్పి , పొట్ట ఉబ్బుట వంటి వాతవేదనలు మలము , అపానవాయువు బయటకి వెడలకుండా ఉండటం , శరీరం మొద్దుబారుట, మోహము వంటి లక్షణాలు విష్టబ్దాజీర్ణం నందు కలుగును .


 *  రసాజీర్ణం -


         అన్నద్వేషం , గుండెలు బరువుగా ఉండటం, శరీరం జడమగు లక్షణాలు కలుగును.


        పైన చెప్పిన ఆమాజీర్ణరోగం సంభవించినప్పుడు వేడినీరు తాగుట, విదగ్ధాజీర్ణం నందు పొట్టకు చెమట పట్టునట్లు చేయుట , కాపడం పెట్టుట , విషభ్దాజీర్ణం సంభవించినపుడు విరేచనౌషధములు పుచ్చుకొనుట , రసాజీర్ణం నందు పడుకొనుట వంటి ఉపచారాలు చేయవలెను .


 ఆహారపదార్థాల అతిగా భుజించటం వలన కలిగిన ఆజీర్ణాలకు విరుగుళ్లు  -


 *  నేయి వలన కలిగిన అజీర్ణానికి వేడినీరు , నూనె వలన కలిగిన అజీర్ణానికి బియ్యపుకడుగు తాగవలెను. గోధుమ వలన కలిగిన అజీర్ణానికి దోసకాయ తినవలెను . అరటిపండ్లు , మామిడిపండ్లు తినడం వలన కలిగిన అజీర్ణానికి నెయ్యిని తాగవలెను.


 *  కొబ్బరికాయ తినడం వలన కలిగిన అజీర్ణానికి బియ్యపు కడుగు , మాంసం వలన కలిగింది అజీర్ణానికి కలిని , నారింజపండ్ల వలన కలిగిన అజీర్ణానికి బెల్లం , చారకాంద గడ్డ వలన అజీర్ణానికి అరిక బియ్యం సేవించిన అజీర్ణం శమించును .


 *  రొట్టె, పూరి మున్నగు పిండి వంటల చేత కలిగిన అజీర్ణానికి నీరును తాగవలెను. చారపప్పు వలన కలిగిన అజీర్ణానికి కరక్కాయ , మినుములు వలన కలిగిన అజీర్ణానికి కలకండ , పాల వలన కలిగిన అజీర్ణానికి మజ్జిగ , పుచ్చకాయ వలన కలిగిన అజీర్ణానికి వేడినీరు తాగవలెను.


 *  చేప మాంసం వలన కలిగిన అజీర్ణానికి మామిడిపండు , మద్యము వలన కలిగిన అజీర్ణానికి తేనె కలిపిన నీరు , పనస కు అరటి , అరటి కు నెయ్యి , నెయ్యికి నిమ్మపండ్ల రసం , నిమ్మపండ్ల రసమునకు ఉప్పు , ఉప్పునకు బియ్యపు కడుగు విరుగుడు .


 *  దానిమ్మ, ఉసిరిక, తాటిపండు, తుమికి, మాదిఫలం , చింతకాయ వీటివలన కలిగిన అజీర్ణము నకు పొగడపండ్లు , ఇప్ప, మారేడు , ఖర్జురము , వెలగ వీనివలన కలిగిన అజీర్ణమునకు వేపగింజలను నీటితో నూరి తాగిన తగ్గును. మాదిఫలం వలన కలిగిన అజీర్ణమునకు తెల్లావాలు వేయించి పొడి గొట్టి తినిన శమించును .


 *  రేగుపండుకు వేడినీరు , ఉశిరికకు ఆవాలు , ఖర్జురము , పెద్ద ఈతపండ్లు , ద్రాక్ష వీనికి నూనెయు , తాటిపండుకు మిరియాలు విరుగుడు పదార్థములు . మాంసం , పనస అజీర్ణమునకు మామిడి జీడియు , పులగము, బర్రెపాలు , చనుబాలు వీనియొక్క అజీర్ణమునకు సైన్ధవలవణం , అటుకులు జీర్ణమునకు పిప్పళ్లు , మరియు ఓమము , రెండుపప్పులు గల ధాన్యము అనగా శెనగలు మున్నగువాటి అజీర్ణమునకు మంచినీరు నశించేయును.


       పైన చెప్పిన విధముగా ఆయా ఆహారపదార్ధాల అతిసేవనం వలన ఏర్పడిన అజీర్ణాలకు విరుగుళ్లు తప్పక తీసికొనవలెను. 



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

కామెంట్‌లు లేవు: