శు భో ద యం🙏
కంకంటి పాపరాజు పాత్రచిత్రణ!
తెనుగున వెలసిన ఉత్తరరామాయణము కావ్యములలో కంకంటి వారిరచనకే ప్రచారమధికము. దానికి వారి రచనావిధానమే ననుట యదార్ధము.
సీతాపరిత్యాగఘట్టమున
వాల్మీకి ఆశ్రమమున ఆశ్రమునొందిన సీతజీవన విధానమును చదివినవారు కంటతడిబెట్టకుండ నుండుటరిదియే!
"*రంగారు బంగారు చెంగావులు ధరించు*
శృంగారవతి నారచీర లూనె.
భూజనంబులు మెచ్చు భోజనంబులొనర్చు
కమలాక్షి
కందమూలములు నమలె.
చంద్రకాంత విశాల
చంద్రశాలల నుండు
జవ్వని
మునిపర్ణ శాల నుండె.
మరులుతో
శ్రీరామునురముపై బవళించు
బాలికామణి
యొంటి పవ్వళించె.
కనుసన్నల
శుద్ధాంత కాంత లాచరించు
సేవలు మెచ్చని
కాంచనాంగి, యొగ్గె
ముని ముగ్ధ కాంతా కృతోపచార విధికి,
నెంచ,న సాధ్యంబు
విధికి గలదె?
🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి