🙏జై శ్రీమన్నారాయణ🙏
16.01.2025,గురువారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి:తదియ తె4.25 వరకు
వారం:బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం:ఆశ్లేష మ12.03 వరకు
యోగం:ఆయుష్మాన్ రా2.14 వరకు
కరణం:వణిజ సా4.06 వరకు తదుపరి విష్ఠి తె4.25 వరకు
వర్జ్యం:రా12.43 - 2.24
దుర్ముహూర్తము:ఉ10.19 - 11.04 మరల మ2.45 - 3.29
అమృతకాలం:ఉ10.23 -12.03
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.0 - 7.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.39 సూర్యాస్తమయం:5.41
'ఎలా ఉన్నారు' అని మనం అడిగితే మిత్రుడు “ఏదో, అలా గడిచిపోతోంది' అన్నాడంటే, అతడి మెదడు స్తబ్ధంగా ఉందన్నమాట. వివేకం మందగించిందని, జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నాడని అవగతం అవుతుంది. ఈ కోల్పోతున్న వాటన్నింటిని నిలబెట్టుకోవాలంటే కొత్తది వినాలి, కొత్తది చూడాలి, కొత్తది చదవాలి. అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తే మన ఆలోచనల్లో నూతనత్వం, ఆచరణలో వేగం తగ్గిపోతున్నాయని గమనించవచ్చు. కొందరికి మంచి ఆలోచనలు ఉంటాయి. తెలివి ఉంటుంది. ప్రణాళిక రచనా నైపుణ్యమూ ఉంటుంది. కానీ పని ప్రారంభించరు. ఆలోచనల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల అతడికి లాభం లేదు. సమాజానికి మేలు జరగదు. ఇలా అన్నీ తెలిసి, ఏదీ చేయనివాడు, ఏదీ తెలియనివాడితోనే సమానం. మేధావులు మౌనంగా ఉంటే జాతికి ద్రోహం జరుగుతున్నట్లే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి