21, జనవరి 2025, మంగళవారం

కాకరకాయ ఉపయోగాలు

 కాకరకాయ ఉపయోగాలు  - 


     కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 


           వంకాయలో తెల్ల కాకర కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 


                  కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను  పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను .  


               కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 


        చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 


                కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 


             కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 


    కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

కామెంట్‌లు లేవు: