14, అక్టోబర్ 2020, బుధవారం

సమస్యలు

 *సమస్యలు పరిష్కారాలు:-*


👉 ఎంత ప్రయత్నించినా మీ ప్రయత్నం ఫలితాలు లేదా మీ కృషికి తగిన ఆదాయం పొందలేకపోతే ఇంటి ముందు గానీ ఇరువైపులా గానీ , ఎండిన చెరువు, నదులు, సరస్సులు ఉండి ఉండాలి! అది కనబడకుండా ఉండాలంటే డోర్ కి కర్టెన్లు వేయాలి. అద్దె ఇల్లు అయితే వేరే ఇంటికి మారండి . అటువంటి చిత్రపటాలు కూడా ఇంట్లో ఉండకూడదు. 


👉 ఆర్థిక నష్టాలు తొలగాలంటే , నీళ్ళలో పచ్చిపాలను కలిపి ఇంట్లోని గదులంతటా చిలకరించి తుడిచి వేయండి. గడపను కూడా అదే నీటితో కడిగి పసుపు, కుంకుమ , పుష్పాలతో అలంకరించుకోవాలి. మిగిలిన నీటిని వృక్షాలకు పోయాలి . ధనలాభం కలుగుతుంది. 


👉 దారిద్ర్య బాధలు తొలగాలంటే చాతుర్మాసంలో ప్రతీ మాసంలో మీ జన్మనక్షత్రం రోజున వస్త్రాది దానాలు చెయండి.


👉 ఋణబాధలు తీరాలి అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందు 8 ప్రమిదలను ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి ఒక్కో దీపం వద్ద ఒక్కోక్క తీపి పదార్థం నివేదనగా ఉంచి పూజ అనంతరం కుటుంబ సభ్యులు అందరూ మహాప్రసాదంగా తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ పేదలకు పంచండి. ఋణబాధలు నుంచి విముక్తి కలిగి సంతోషకరమైన జీవితం పొందుతారు ఈ విధంగా 4 వారాలు చేయండి.


👉 శతృపీడలు అధికమైతే విభూది లింగమును పూజించి నదిలో నిమజ్జనం చేయడం మంచిది.


👉 అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటే ప్రతీ మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణము చేయవలెను. అదే రోజు పేదవారికి ఏదైనా దానం చేయాలి. మరుసటి రోజు అంటే ఋధవారం కూడా జానపదులు పాడే వారికి కానీ , బుడబుక్కల వారికి గానీ లేదా గంగిరెద్దుల వారికి కానీ కొంత డబ్బు సహాయం చేయండి. ఈ విధంగా 7 మంగళవారాలు , 7 బుధవారాలు చేయడం వల్ల ఆకస్మికంగా ధనం ధాన్యం లభ్యం అవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరుగుతుంది. 


👉 బ్యాంకు ఋణములు పొందుటకు ఎంత ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా కనిపించకపోతే బుధ వారం రోజు రాత్రి శనగలను నానబెట్టి గురువారం ఉదయం కపిల గోవునకు తినిపించి గంగడోలును స్పురించండి.అలా రెండు సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది .


👉 ఆదివారం రవిహోరలో ఉదయం 10:30, 11.00 గంట సమయంలో సేకరించిన తెల్లజిల్లేడు చెట్టు వేరును అష్టగంధంతో కలిపి తావీజు నందు బంధించి మెడ లేదా నడుముకు ధరిస్తే దారిద్ర్యం నశించి , శతృవులపై విజయం కలిగి వారి ద్వారానే ధనలాభం కలుగుతుంది.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

*శ్రీ బాలా త్రిపురసుందరి పీఠం*

*విజయనగరం*

కామెంట్‌లు లేవు: