లక్ష్మీ దేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి "వైజయంతి మాల"
వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి. వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.
క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.
"కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ"
లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.
వైజయంతి మాల లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజు పూజ చేసి బీరువాలోగానీ,మెడకు గాని ధరించవచ్చును. వైజయంతి మాలను దీపావళి రోజు గాని,శుక్రవారం రోజుగాని లక్ష్మీదేవి పటానికి గాని,శ్రీచక్రమేరువుకి గాని అలంకరించి లలితా సహస్త్రనామంతో గాని,లక్ష్మీ అష్టోత్తరంతో గాని కుంకుమార్చన చేసి వైజయంతీ మాలను మెడకు దరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వైజయంతిమాలను లక్ష్మీ దేవి అలంకరణలో గాని,పూజలో గాని తప్పనిసరిగా ఉపయోగించాలి.
వైజయంతి మాల పూసలను చిన్నపిల్లలకు చెవిపోగు,లాకెట్ లాగా చేపించి వేసిన బాలారిష్ట దోషాలు,నరదృష్టి,చొంగకార్చటం తగ్గుతుంది.
వైజయంతిమాలను వివాహం కానివారు నిత్యకళ్యాణం జరిగే దేవాలయంలో ఈ మాలను ధరించి కళ్యాణం చేపించుకున్న యెడల వారికి సత్వర వివాహం జరుగుతుంది.వైజయంతిమాలను దరించి రుక్మిణీ కళ్యాణం ఇంటిలోగానీ,దేవాలయంలో గాని చేపించుకొన్న వివాహ సంబంద ఆటంకాలు తొలగిపోతాయి.
దంపతుల మద్య తరచూ గొడవలు ఉన్న వారు వైజయంతిమాలను ధరించటం వలన వారి మద్య ఉన్న అపోహలు,గొడవలు తొలగిపోయి ఇద్దరు ఒకరికొకరు మంచి అవగాహనతో ప్రేమాను రాగాలతో దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తారు.
వైజయంతిమాలను వ్యాపార సంస్ధలలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు అలంకరించిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.
జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు,సప్తమభావ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను ధరించటం మంచిది. శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు వైజయంతి మాలను మెడకు గాని,బ్రాస్ లెట్ గాగాని,లాకెట్ గాగాని ధరించిన శుక్రగ్రహ దోషాలు తొలగి పోతాయి.
వైజయంతిమాలను ధరించినవారికి సమగ్రమైన ఆలోచనా విదానంతో ప్రతి పనిని అంచనా వెయ్య గలిగే సామర్ద్యం కలిగివుంటారు.వైజయంతిమాలను దరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి