14, అక్టోబర్ 2020, బుధవారం

పరమ_శివుడు_కొలువైన_పంచారామ_క్షేత్రాలు శ్రీ సోమేశ్వర స్వామి (అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు. పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు. రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ. మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు. నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది. ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు. పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు. 4. సోమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే. అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు. స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.

 పరమ_శివుడు_కొలువైన_పంచారామ_క్షేత్రాలు

 శ్రీ సోమేశ్వర స్వామి

(అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.

పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.

రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.

మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.

నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.

ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.

పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.

4. సోమారామం

ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే.

అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు.

స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.

కామెంట్‌లు లేవు: